రామ్ కోసం రాక్ స్టార్ మళ్లీ వస్తున్నాడు

రామ్ కోసం రాక్ స్టార్ మళ్లీ వస్తున్నాడు

యంగ్ హీరో రామ్ ఇప్పుడు మళ్లీ ఇప్పుడు హిట్టు కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చేశాడు. హలో గురూ ప్రేమ కోసమే.. అంటూ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ మూవీని పూర్తి చేసే పనిలో పడిపోయాడు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి.. మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నాడు నిర్మాత దిల్ రాజు.

కానీ రాక్ స్టార్ బిజీ షెడ్యూల్ కారణంగా.. ఈ మూవీకి వర్క్ చేయడం కష్టం అయిపోయింది. పైగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి విడుదల చేసేయాలని నిర్ణయించుకున్న దిల్ రాజు.. దేవిశ్రీ స్థానంలో ఎస్ఎస్ థమన్ ను తీసుకోవాలని భావించారు. ఈ మేరకు మాటా మంతీ కూడా జరిగిపోయాయి. అయితే.. ఇప్పుడీ సినిమా దసరాకు గానీ రెడీ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. షెడ్యూల్స్ అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టడం.. అలాగే పెండింగ్ వర్క్ ఇంకా చాలా ఉండడంతో.. చకచకా పూర్తి చేసేయాలని దిల్ రాజు భావించినా.. రీసెంట్ గా తగిలిన దెబ్బల కారణంగా.. క్వాలిటీకే ఫిక్స్ అయ్యారు నిర్మాత.

ఎలాగూ లేట్ అవడం ఖాయం అని అర్ధం అయిపోవడంతో.. ఇప్పుడు మళ్లీ రాక్ స్టార్ తోనే మ్యూజిక్ చేయించాలని నిర్ణయించారట. హలో గురూ ప్రేమ కోసమే చిత్రానికి సంగీతం అందించేందుకు డీఎస్పీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. తమన్ ను తప్పించేయాలని డిసైడ్ అయిపోయారట మేకర్స్. అలా రామ్ కోసం మళ్లీ రాక్ స్టార్ దిగొచ్చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు తెగ చెప్పేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు