కోలీవుడ్ కోసం అఖిల్ భామ ఆరబోస్తోంది

కోలీవుడ్ కోసం అఖిల్ భామ ఆరబోస్తోంది

టాలీవుడ్ లో విపరీతమైన ఆసక్తి కలిగించిన అక్కినేని అఖిల్ అరంగేట్ర చిత్రం అఖిల్ తో తెరంగేట్రం చేసిన భామ సాయేషా సైగల్. దిలీప్ కుమార్-సైరాభాను ఫ్యామిలీకి చెందిన ఈ బ్యూటీ.. తెలుగు సినీ రంగంలో చక్రం తిప్పాలనే తలంపుతోనే ఇక్కడకు వచ్చింది. కానీ అఖిల్ మూవీ ఈమె ఆశలపై నీళ్లు చల్లేయగా.. బాలీవుడ్ మూవీ శివాయ్ ఈమెకు సక్సెస్ ను అందించింది.

ఆ తర్వాత వనమగన్ చిత్రంతో కోలీవుడ్ ఛాన్స్ రావడం.. వెంటనే అక్కడ పాదం మోపేసి హిట్ కొట్టేయడం జరిగిపోయాయి. ప్రస్తుతం జుంగా.. కడైకుట్టి సింగం.. గజినీకాంత్ అంటూ ఈమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. తనకు కెరీర్ ఇచ్చిన కోలీవుడ్ కోసం ఈ భామ బాగానే కష్టపడుతోంది. కొంచెం కొంచెంగా గ్లామర్ డోస్ కూడా పెంచుకుంటూ పోతోంది. ఆర్యతో కలిసి నటిస్తున్న గజినీకాంత్ మూవీకి సంబంధించిన రీసెంట్ పోస్టర్లలో అఖిల్ బ్యూటీ ఆరబోసిన అందాలను చూస్తే మైమరచి పోవాల్సిందే.

పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంలో ఎంతలేసి అందాలను చూపించవచ్చో.. ప్రాక్టికల్ గా పాఠాలు చెబుతున్నట్లుగా ఉంది అమ్మడి వాలకం. ఎంతైనా ముంబై భామ కదా.. ఫిట్నెస్ మీద బాగా శ్రద్ధ ఎక్కువ. అంత ఫిట్టుగా ఉండి.. ఇంత టైట్ గా ఉండే షార్ట్ లెంగ్త్ డ్రెస్సులు వేస్తే.. ఇక అందాల ఎగ్జిబిషన్ ను చూసి తరించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు