లేడి కమెడియన్ 'రాణి' పంచ్

లేడి కమెడియన్ 'రాణి' పంచ్

మేఘన్ మార్కెల్.. మాజీ యాక్ట్రెస్ నుంచి ఇప్పుడు యువరాణిగా మారిపోయింది. ఇదే మేఘన్ 22 ఏళ్ల క్రితం అదే బకింగ్ హాం ప్యాలెస్ ముందు.. జస్ట్ ఒక టూరిస్ట్ గా దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. 22 ఏళ్ళ తరువాత ఆమె అదే ప్యాలెస్ కు వారసురాలు అయిపోవడమే ఆ ఫోటో చెప్పే కథ. ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలుసు కానీ.. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే.. ఈ విషయాన్ని మన కమెడియన్ విద్యుల్లతా రామన్.. ఓ రేంజ్ లో స్పూఫ్ చేసి పారేసింది.

రెండు ఫోటోలను కలిపి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విద్యు.. వాటికి రైటప్ కూడా తనే ఇచ్చింది. పైన ఉన్న ఫోటోలో 22 ఏళ్ల క్రితం బకింగ్ హాం ప్యాలెస్ ముందు మేఘన్ మార్కెల్ ఉంది. కింద ఉన్న ఫోటోలో.. నిన్నటికి నిన్న అంటే మే 22న అదే బకింగ్ హాం ప్యాలెస్ ముందు తను నుంచున్న ఫోటోను పోస్ట్ చేసింది విద్యుల్లత. తను ఇప్పుడు బకింగ్ హాం ప్యాలెస్ కి రాణిగా మారేందుకు మరో 22 ఏళ్లు వెయిట్ చేస్తే సరిపోతుందంటోంది విద్యుల్లత. అఫ్ కోర్స్ ఆమెకి నిజంగా అలాంటి కోరికలు ఉన్నాయని చెప్పలేం కానీ.. ఈ కామెడీ పంచ్ మాత్రం కేకలా ఉందని చెప్పాల్సిందే.

సినిమాల్లో కామెడీ చేయడంలోనే ఇరగదీసేసే విద్యుల్లత.. రియల్ లైఫ్ కామెడీలు.. ప్రాక్టికల్ జోకుల విషయంలో కూడా కుమ్మేస్తోందని చెప్పాలి. వెంటనే ఈ కామెడీపై లావణ్య త్రిపాఠి వంటి హీరోయిన్లు.. వావ్ అంటూ ట్వీట్లు కూడా వేసేశారు. మరి 22 ఏళ్ళ తరువాత ఏదో అవ్వాలని పోటో దిగేసిన విద్యు.. ఏమవుతుందో చూసుకుందాం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English