భార్యపై స్టార్ హీరో జోక్ చూశారా..

భార్యపై స్టార్ హీరో జోక్ చూశారా..

స్టార్ హీరో అజయ్ దేవగన్.. గత తరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్.. భార్యాభర్తలు అనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఈ స్టార్ కపుల్ కు నైసా అనే కుమార్తె కూడా ఉంది. కాజోల్ తన కెరీర్ లో చాలానే ఘనతలు సాధించింది. ఇందుకు గుర్తుగా.. రీసెంట్ గా టుస్సాడ్స్ మ్యూజియంలో ఈమె మైనపు విగ్రహాన్ని రూపొందించారు.

ఆనవాయితీ ప్రకారం.. కాజోల్ తోనే ఆమె వాక్స్ స్టాట్యూను లాంఛ్ చేయించారు. అయితే.. ఈ కార్యక్రమానికి అజయ్ దేవగన్ రాలేదు కానీ.. కూతురుతో కలిసి సరదాగానే అక్కడ గడిపింది కాజోల్. అంతే కాదు.. తన బొమ్మతో తానే సెల్ఫీ తీసుకుని.. తానెప్పుడూ కాజోల్ ఫ్యాన్ నే అంటూ నవ్వులు పూయించింది. అయితే.. భర్త అజయ్ దేవగన్ మాత్రం.. అంతకు మించిన సెన్సాఫ్ హ్యూమర్ చూపించేశాడు. 'సైలెంటుగా ఉన్న కాజోల్ ను ఓసారి చూడండి' అంటూ వాక్స్ స్టాట్యూను ఉద్దేశించి కామెంట్ చేశాడు అజయ్ దేవగన్.

ఇండస్ట్రీలో అజయ్ దేవగన్ కు సైలెంట్ పర్సన్ అనే పేరు ఉంది. అయితే.. కాజోల్ ది ఇందుకు భిన్నమైన పరిస్థితి. ఎప్పుడూ లొడలొడా మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె మాటలను ఉద్దేశించే.. ఎప్పుడూ గలగలా మాట్లాడే భార్యకు కౌంటర్ వేస్తూ.. సైలెంటుగా ఉన్న కాజోల్ ను తొలిసారిగా తాను చూస్తున్నానని అర్ధం వచ్చేలా జోక్ పేల్చాడు అజయ్ దేవగన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు