నాని ఆశలకు తెరపడినట్లేనా?

నాని ఆశలకు తెరపడినట్లేనా?

గత మూడేళ్లలో హిట్ల మీద హిట్లు కొట్టి హీరోగా తన ఫాలోయింగ్, మార్కెట్ చాలా పెంచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. స్టార్ డైరెక్టర్ల అండ లేకుండానే అతను తన ఇమేజ్ పెంచుకోగలిగాడు. అతడి మార్కెట్ రూ.30 కోట్లను దాటిపోయింది. ఐతే నిజానికి ఈ మార్కెట్ నానికి చాలా ముందే వచ్చింది. కానీ అక్కడి నుంచి పైకి మాత్రం వెళ్లలేకపోయాడు.

ఇలాంటి తరుణంలో నాని పెద్ద డైరెక్టర్లతో పని చేస్తే రేంజ్ పెరుగుతుందని.. కెరీర్ మరో స్థాయికి చేరుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. నాని లాంటి ప్రతిభావంతుడితో పెద్ద డైరెక్టర్లు ఎందుకు పని చేయట్లేదు.. నాని కూడా వాళ్లతో సినిమాలు చేయడానికి ఎందుకు ప్రయత్నించట్లేదు అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించి నాని కూడా స్టార్ డైరెక్టర్ల కోసం ట్రై చేశాడు. అదే సమయంలో విక్రమ్ కుమార్.. కొరటాల శివ లాంటి దర్శకుల కళ్లు నానిపై పడ్డాయి.

వరుసగా ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో నాని సినిమాలు చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. వీళ్లతో నాని సంప్రదింపులు కూడా జరిపాడు. విక్రమ్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫమ్ అయినట్లే కనిపించింది. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. అతను వేరే హీరో వైపు మళ్లాడు. ఐతే కొరటాల శివతో అయినా సినిమా ఉంటుందని నాని ఆశించాడు. కెరీర్ ఆరంభం నుంచి సూపర్ స్టార్లతోనే పని చేస్తున్న కొరటాల కూడా ఛేంజ్ కోసం నానితో ఓ డిఫరెంట్ ఫిలిం చేయాలని ఆశించాడు. ఈ ప్రాజెక్టుపై సీరియస్‌గానే ఉన్నాడు.

తనతో వెంటనే సినిమా చేయడానికి ఏ స్టార్ అందుబాటులో లేకపోవడం కూడా అతడిలా ఆలోచించడానికి పురిగొల్పింది. నాని సినిమా కోసం కథ మీద కూర్చుందాం అనుకుంటుండగా.. అనుకోకుండా చిరు నుంచి పిలుపొచ్చింది. అనూహ్యంగా ఆ ప్రాజెక్టు సెట్టయింది. ఈ ఏడాది చివరి క్వార్టర్ నుంచి సినిమా మొదలుపెట్టడానికి కూడా అంగీకారం కుదిరింది. దీంతో నానికి టాటా చెప్పక తప్పలేదు. కొరటాల సినిమా ఉంటుందని వేరే ఆఫర్లు కూడా పక్కన పెట్టిన నానికి నిరాశ తప్పలేదు.  ఇక తన స్టయిల్లో మీడియం రేంజి సినిమానే చేసుకోవడానికి నాని రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English