శ్రీదేవి డెత్ తర్వాత ఆ ఫోటోలు పెరిగాయ్

శ్రీదేవి డెత్ తర్వాత ఆ ఫోటోలు పెరిగాయ్

ఒక థీమ్ ను కంటిన్యూ చేయడం అనేది మన దగ్గర రెగ్యులర్ గా కనిపించిన విషయం. సినిమాలు మాత్రమే కాదు.. అనేక విషయాల్లో విజయాన్ని అందుకునేందుకు ఇలాంటి సేమ్ కాన్సెప్టులను ఫాలో అయిపోతూ ఉంటారు. ఇదుగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఉన్న భామ పేరు కరిష్మా శర్మ. చాలా కాలంగా హిందీ టీవీ సీరియళ్ళల్లో మెరుస్తోంది. 

టీవీ సీరియల్స్ లో లీడ్ రోల్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్యార్ కా పంచ్ నామా2 మూవీలో కూడా మెరిసిన అనుభవం ఉంది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా యాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్యనే రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ అంటూ సెన్సేషన్ కోసం ప్రయత్నించింది. ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కూడా మహా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా పలు రివీలింగ్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా  బాత్ టబ్ లో వయ్యారంగా కూర్చుని పోజు ఇచ్చి.. పక్కనే గులాబీలతో ఫోటోను ఆకర్షణీయంగానే మార్చింది. 

కాకుంటే.. ఇక్కడ ఆ భామ అందాల కంటే.. బాత్ టబ్ ఎక్కువగా హైలైట్ కావడమే అసలు పాయింట్. శ్రీదేవి బాత్ టబ్ లో మరణించిన సంఘటన తర్వాత నుంచి.. ఇలా బాత్ టబ్ ఫోటోల హంగామా బాగానే పెరిగింది. జనాలు కూడా బాత్ టబ్ కనిపించగానే.. కాసింత ఆసక్తిగా గమనిస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇదుగో ఇలాంటి ఫోటోలతో నెట్ లో హల్ చల్ చేస్తున్నారు అందాల భామలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English