అమెజాన్ కోసం మహానటి వెయిటింగా??

అమెజాన్ కోసం మహానటి వెయిటింగా??

ఈరోజుల్లో rnసినిమాకు థియేటరికల్ రైట్స్ తోపాటు శాటిలైట్ రైట్స్ నుంచి వచ్చే ఆదాయం కూడాrn కీలకంగా మారింది.  హిట్ సినిమాలకు.. క్రేజీ కాంబినేషన్లతో చేసే సినిమాలకు rnదాదాపు నాలుగో వంతు వ్యయం శాటిలైట్ రైట్స్ నుంచే వచ్చేస్తోంది. కొన్ని rnసినిమాకు రిలీజ్ కు ముందే మంచి ఆఫర్ వస్తోంది. కొన్ని సినిమాలు సైలెంట్ గా rnరిలీజై హిట్ కొడతాయి. అప్పుడు నిర్మాతలు కోరినంత మొత్తం ఇచ్చి శాటిలైట్ rnరైట్స్ దక్కించుకుంటూ ఉంటారు. 


రీసెంట్ గా rnరిలీజైన సినిమాల్లో మహానటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ రిలీజ్ కుrn ముందు మరీ విపరీతమైన బజ్ ఏమీ లేదు. దాంతో శాటిలైట్ రైట్స్ క్రేజీ ఆఫరేం rnరాలేదు. సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు రైట్స్ అమ్మకుండానే రిలీజ్ rnచేశారు. ఇప్పుడు మహానటి సూపర్ హిట్ కావడంతో శాటిలైట్ కు డిమాండ్ పెరిగింది.rn తీరా ఇప్పుడేమో నిర్మాతలు చెట్టెక్కి కూర్చున్నారని తెలుస్తోంది. మహానటి rnతమిళంలో నడిగర్ తిలగం పేరుతో రిలీజైంది. ఈ రెండు భాషల్లోనూ కలిపి ఒకేసారి rnరైట్స్ సెటిల్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇప్పటివరకు 12 కోట్లు 18 కోట్లుrn అని వచ్చిన టాక్ లో నిజం లేదని.. ఎందుకంటే ఈ సినిమాను ఇంకా అమ్మలేదని rnఅంటున్నారు. 

రెండు భాషలకు కలిపి రూ. 30 కోట్ల rnవరకు అడుగుతున్నారనేది లేటెస్ట్ టాక్. మీడియేటర్లు ఈ అమౌంట్ విని కళ్లు rnతేలేస్తున్నారట. ప్రస్తుతం హిట్ సినిమాలన్నింటినీ అమెజాన్ మంచి రేటిచ్చి rnకొనేస్తోంది. వాళ్లు రంగంలోకి దిగితే రూ. 30 కోట్లు వస్తాయన్నది నిర్మాతల rnఆలోచన. కానీ అంత మొత్తం వస్తాయా.. అమెజాన్ అందుకు రెడీ అంటుందా.. వేచి rnచూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు