వైవీఎస్ చౌదరి మళ్లొచ్చాడు

వైవీఎస్ చౌదరి మళ్లొచ్చాడు

ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు వైవీఎస్ చౌదరి. స్టార్లను నమ్ముకోకుండా హరికృష్ణ లాంటి క్రేజ్ లేని హీరోను.. రామ్ లాంటి కొత్త కథానాయకుడిని పెట్టి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఘనుడతను. కానీ తర్వాత చౌదరి ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారింది. ‘ఒక్కమగాడు’.. ‘సలీమ్’.. ‘రేయ్’ లాంటి వరుస డిజాస్టర్లతో అడ్రస్ లేకుండా పోయాడు. ముఖ్యంగా ‘రేయ్’ సినిమా చౌదరిని పూర్తిగా ముంచేసింది. ఆ దెబ్బతో ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయే పరిస్థితికి వచ్చాడు. ‘రేయ్’ విడుదలై మూడేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటిదాకా చౌదరి నుంచి మరో సినిమా రాలేదు. అప్పట్లో ఏదో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అవేమీ నిజం కాలేదు. ఐతే చౌదరి ఇప్పుడు నిజంగానే కొత్త సినిమాతో రాబోతున్నాడట.

మొన్ననే తన పుట్టిన రోజు జరుపుకున్నాడు వైవీఎస్ చౌదరి. ఈ సందర్భంగా తాను త్వరలోనే కొత్త సినిమాతో రాబోతున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఈ సినిమా కూడా స్వీయ నిర్మాణంలోనే ఉంటుందని.. ఇందులో అందరూ కొత్తవాళ్లే నటిస్తారని ఆయనంటున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందట. త్వరలోనే వివరాలు ప్రకటిస్తాడట. ఐతే ‘రేయ్’ కోసం చేసిన అప్పుల్ని తీర్చడానికి తన థియేటర్లను అమ్ముకోవాల్సిన స్థితికి వచ్చాడు చౌదరి. ఇప్పుడతను సినిమా తీస్తానంటూ ఫైనాన్స్ సమకూరుతుందా అన్నది కూడా సందేహమే. అతడి మార్కెట్ అంత దారుణంగా పడిపోయింది. ఇలాంటి స్థితిలో చౌదరి సొంత బేనర్ మీద సినిమా చేయడం సాధ్యమేనా అన్నది డౌటు. అదే సమయంలో చౌదరితో బయటి వాళ్లు సినిమా తీయడానికి ముందుకొస్తారా అన్నదీ సందేహమే. చూద్దం మరి చౌదరి ఈసారి ఏం సాహసం చేస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English