టైటిల్ కోసం అంత కష్టపడ్డారా?

టైటిల్ కోసం అంత కష్టపడ్డారా?

ఏదైనా ఓ టైటిల్ ను క్యాచీగా మార్చడం ఒక లెక్క అయితే.. క్యాచీ వర్డ్స్ ను టైటిల్ గా పెట్టుకునేందుకే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే బడా బ్రాండ్స్ పేర్లను సినిమాలకు సెట్ చేసుకోవడం అయితే.. మరీ కష్టమైన విషయం.

కొన్నేళ్ల క్రితం మిస్టర్ నోకియా అంటూ మంచు మనోజ్ ఓ సినిమా తీశాడు. కానీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి సమస్యలు ఎదురయ్యి.. చివరకు దాన్ని మిస్టర్ నూకయ్య అని మార్చాల్సి వచ్చింది. కానీ నోకియా మాదిరిగా ఇది కనెక్టింగ్ వర్డ్ కాకపోవడం.. సినిమాపై బజ్ ను క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు కార్తికేయ.. పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న RX100. యమహా కంపెనీకి చెందిన సూపర్ డూపర్ సక్సెస్ మోడల్ ఇది. ఇప్పటికే కుర్రకారులో ఇంకా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ బైక్ పేరును.. సినిమాకు పెట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు నిర్మాత అశోక్ రెడ్డి వేరే టైటిల్ ను చూడాలని దర్శకుడు అజయ్ తో చెప్పారట.

కానీ పట్టు వదలని అజయ్.. చెన్నై మార్కెటింగ్ హెడ్ ను కలిసి.. ఈ సినిమాలో ఆ బైక్ కి ఉన్న ఇంపార్టెన్స్ తో పాటు.. సినిమాలో ఆ బైక్ కి కూడా కీలక రోల్ ఉంటుందని చెప్పారట. ఇదే  విషయాన్ని జపాన్ హెడ్ క్వార్టర్స్ తెలియచేసి.. చివరకు సినిమా టైటిల్ గా RX100ను పెట్టుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారట. అయితే.. చట్టపరమైన సమస్యల కారణంగా.. యమహా బ్రాండ్ ఉపయోగించుకునేందుకు మాత్రం అంగీకరించలేదు. ఒక్క టైటిల్ కోసం ఇంతగా కష్టపడ్డ దర్శకుడు.. సినిమాకోసం ఇంకెంత శ్రమించి ఉంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు