ఇల్లీకే కోట్లా.. ఇది ఫుల్లుగా కామెడీనే!?

ఇల్లీకే కోట్లా.. ఇది ఫుల్లుగా కామెడీనే!?

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో కనపడి ఆరేళ్లు దాటిపోయింది. 2012లో జులాయి.. దేవుడు చేసిన మనుషులు తర్వాత తెలుగులో నటించలేదు ఈ భామ. మళ్లీ ఇన్నేళ్లకు రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ మూవీకి సైన్ చేసి.. రీఎంట్రీకి రెడీ అయింది ఇలియానా.

అయితే.. ఈ సినిమా కోసం ఈ గోవా భామ ఏకంగా 2 కోట్లు పుచ్చుకున్నాకే సంతకం పెట్టిందన్నది ఇప్పుడు వినిపిస్తున్న రూమర్. బాలీవుడ్ లో ఇరగదీసేస్తోంది కాబట్టి.. అక్కడి భామలకు మనోళ్లు బాగానే ముట్టచెబుతారు కాబట్టి.. ఇదంతా నిజమే అనిపించక మానదు. కానీ అమర్ అక్బర్ అంటోనీ చిత్రంలో.. ఇల్లీ ఒక్కతే హీరోయిన్ కాదు. మొత్తం ముగ్గురు ఉంటారనే లెక్క ముందు నుంచి వినిపిస్తూనే ఉంది. మరి ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన ఇలియానాకే 2 కోట్లు ఇచ్చేస్తే.. మిగిలిన వాళ్లకు ఎంత ఇవ్వాలి.. హీరోతో కలుపుకుంటే మొత్తం రెమ్యూనరేషన్స్ ఎంత అవుతాయి అన్నదే క్వశ్చన్.

మైత్రీ మూవీస్ సంస్థ సినిమాలపై బాగానే ఖర్చు పెడుతుంది. అయినంత మాత్రాన.. తాము తీస్తున్న సినిమా సత్తా ఎంత.. హీరో ఎవరు.. ఎంత బిజినెస్ చేయచ్చు లాంటి లెక్కలు వేసుకోరని అస్సలు అనుకోలేం. పైగా రవితేజ ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇంత రిస్క్ చేయడం కష్టమే. వీటన్నిటికీ మించి ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల. ఒకప్పుడు ఈయన ఏం చెబితే అది నడిచేదేమో కానీ.. ఇప్పుడు అయితే.. తనకు నచ్చినంత బడ్జెట్ లో తీస్తానంటే కుదిరే బేరం కాదు. ఇవన్నీ గమనిస్తే.. ఇల్లీకి 2 కోట్ల మ్యాటర్.. మొత్తంగా పుకారే అనుకోవచ్చు.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు