ప్రభాస్‌ పెళ్లికి క్యాస్ట్‌ ప్రాబ్లమ్‌!?

ప్రభాస్‌ పెళ్లికి క్యాస్ట్‌ ప్రాబ్లమ్‌!?

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ అయి వుండీ, అమ్మాయిల కలల రాకుమారుడై వుండీ, దేశవ్యాప్తంగా బాహుబలిగా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌కి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కపోవడం ఆశ్చర్యకరమే. ఊ అంటే అతడిని పెళ్లాడ్డానికి ఇండస్ట్రీ నుంచే చాలా మంది హీరోయిన్లు పోటీ పడతారు. మరి ప్రభాస్‌కి పెళ్లి ఎందుకు కుదరడం లేదు. ప్రభాస్‌ ఇంట్లో క్యాస్ట్‌ పట్టింపులు చాలా ఎక్కువట.

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్‌ని ఆ సామాజిక వర్గం వారు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అతడిని ఓన్‌ చేసేసుకోవడమే కాకుండా ఆ కుల సంఘాలకి చెందిన కొందరు పెద్దలు నిత్యం కృష్ణంరాజుతో టచ్‌లోను వుంటారని టాక్‌. చాలా మంది హీరోలు వేరే కులాలకి చెందిన అమ్మాయిలని పెళ్లాడడంతో ప్రభాస్‌ అలా చేయరాదని క్షత్రియ సంఘాలు కృష్ణంరాజుపై ఒత్తిడి తెస్తున్నాయట. ఈ కారణం వల్లే ప్రభాస్‌కి ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లని కూడా అతడు దూరం పెట్టాడనే వదంతులున్నాయి. ఇదిలావుంటే తమ సామాజిక వర్గం నుంచి ప్రభాస్‌కి సూటయ్యే అమ్మాయి దొరకడం లేదట.

కొన్ని పెద్ద కుటుంబాలకి చెందిన అమ్మాయిలు వున్నారు కానీ సినిమా హీరోతో సంబంధాన్ని సదరు కుటుంబాలు కోరుకోవడం లేదట. కొన్ని సంబంధాలు ప్రభాస్‌ కుటుంబానికి నచ్చక వదులుకున్నారట. ఈ యేడాదిలో ప్రభాస్‌ పెళ్లి చేసేద్దామని అనుకున్నారు కానీ ఇంకా ఏదీ సెటిల్‌ కాలేదు కనుక మరి కొన్నాళ్ల పాటు ప్రభాస్‌కి బ్యాచ్‌లర్‌ లైఫ్‌ తప్పదేమో ఇక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు