నాగార్జున చేతిలోకి ఆటోజానీ!

నాగార్జున చేతిలోకి ఆటోజానీ!

మెహబూబా చిత్రంతో తీవ్ర నష్టాలు చవిచూసి, కష్టపడి సంపాదించిన కొన్ని ఆస్తులని కూడా పోగొట్టుకున్న పూరి జగన్నాథ్‌పై ఇప్పుడు చాలా ఒత్తిడి వుంది. తనకి అప్పు ఇచ్చిన వారితో పాటు, మెహబూబా చిత్రంలో పెట్టుబడి పెట్టి సాంతం కోల్పోయిన ఛార్మి కూడా అతడిపై ఒత్తిడి తెస్తోందని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జునతో సినిమా చేయడానికి పూరి జగన్నాథ్‌ పావులు కదుపుతున్నాడు.

శివమణి, సూపర్‌ సినిమాలతో నాగార్జునతో మంచి అనుబంధమే వున్న పూరి జగన్నాథ్‌కి ఆ తర్వాత అతనితో విబేధాలొచ్చాయి. పలుమార్లు ఇద్దరూ కలిసి పని చేద్దామని చూసినా కానీ కుదర్లేదు. కానీ ఇప్పుడు తనతో పని చేయడానికి హీరోలే ముందుకి రాని టైమ్‌లో పూరి జగన్నాథ్‌ తన గురువు రాంగోపాల్‌వర్మ ద్వారా నాగార్జునని కలిసాడని, ఓ కథ చెప్పాడని టాక్‌ వినిపిస్తోంది. ఇంకా నాగార్జున కానీ, పూరి కానీ దీని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ చిరంజీవితో చేద్దామని అనుకున్న ఆటోజానీ కథనే నాగార్జునకి చెప్పాడని, అప్పట్లో చిరంజీవి అభ్యంతరం చెప్పిన సెకండ్‌ హాఫ్‌ మార్చి రాసాడని, నాగార్జున కూడా సానుకూలంగానే స్పందించాడని సమాచారం.

ఆఫీసర్‌ రిలీజ్‌ తర్వాత నాగార్జున, నాని కలిసి చేస్తోన్న చిత్రం దసరా సీజన్‌లో రిలీజ్‌ అవుతుంది. అది పూర్తయ్యేలోగానే పూరి సినిమా సెట్స్‌ మీదకి వెళితే వచ్చే సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ అయిపోతుంది. ఇది కానీ మెటీరియలైజ్‌ అయితే సోగ్గాడే చిన్నినాయనా తర్వాత సంక్రాంతికి వచ్చే నాగ్‌ సినిమా ఇదే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు