మేనల్లుడికి మళ్లీ డేట్‌ కుదర్లేదు

మేనల్లుడికి మళ్లీ డేట్‌ కుదర్లేదు

పీక్‌ సీజన్లతో పాటు హాలిడేలన్నీ పెద్ద, మధ్య తరగతి సినిమాల పరం అయిపోతూ వుండడంతో కొంతమంది స్ట్రగులింగ్‌ హీరోలకి సరైన డేట్‌ దొరకడం లేదు. వరుస పరాజయాలతో కష్టాల్లో వున్న సాయి ధరమ్‌ తేజ్‌కి తన తదుపరి చిత్రం తేజ్‌ ఐ లవ్యూకి కూడా చెప్పుకోతగ్గ డేట్‌ కుదర్లేదు. జూన్‌ 29న ఈ చిత్రం విడుదల చేయాలని డిసైడ్‌ చేసారు. ఆ వారంలో కానీ, ఆ తర్వాతి వారంలో కానీ ఒక్క పబ్లిక్‌ హాలిడే కూడా లేదు.

కేవలం పబ్లిక్‌ టాక్‌ మీద, వీకెండ్స్‌ మీద డిపెండ్‌ అయి కలక్షన్లు రావాలి. నిజానికి ఈ చిత్రాన్ని జూన్‌ పదిహేనున విడుదల చేద్దామని అనుకున్నారు. రంజాన్‌ సెలవు కలిసి వస్తుందని చూస్తే జూన్‌ 14 డేట్‌ని 'సాక్ష్యం' చిత్రానికి రిజర్వ్‌ చేసుకున్నారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో వున్న సమయంలో కాంపిటీషన్‌ దేనికని 'తేజ్‌'ని జూన్‌ 29కి వాయిదా వేసారు.

మరి ఈ డేట్‌ అయినా వేకెంట్‌గా వదిలేస్తారా లేదా మరికొన్ని చిన్న, మీడియం రేంజ్‌ సినిమాలని అనౌన్స్‌ చేస్తారా అనేది చూడాలి. సంక్రాంతి, సమ్మర్‌, దసరా సీజన్లకి మెగా ఫ్యామిలీలో ఎవరో ఒక స్టార్‌ హీరో సినిమా వుంటుంది కనుక ఆ టైమ్‌లో తేజ్‌కి కుదరడం లేదు. మిగతా సమయాల్లో వేరే సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది. ఫామ్‌లో వున్న టైమ్‌లో అయితే ఫర్వాలేదు కానీ డౌన్‌లో వున్నపుడు పోటీకి వెళితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని వెనక్కి తగ్గాల్సొస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English