ఇంతకంటే గొప్పగా ఎవరు చూపిస్తారెహ?

ఇంతకంటే గొప్పగా ఎవరు చూపిస్తారెహ?

సావిత్రి జీవితం పై రూపొందిన బయోపిక్ మహానటి.. చాలా విషయాల్లో బయోపిక్స్ కు బెంచ్ మార్క్ లను సెట్ చేసింది. అయితే.. కొన్ని విషయాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న మాట అయితే వాస్తవమే. కథను రసవత్తరంగా చెప్పేందుకు గాను.. ఇలాంటివి తప్పవు. అయితే.. మహానటిలో జెమినీ గణేశన్ పాత్రను విలన్ మాదిరిగా చూపించారంటూ.. అతడి కూతురు కమల గణేశన్ ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది.

కమలా గణేశన్ చెబుతున్న వెర్షన్ పై ఆడియన్స్ నుంచి విభిన్న అబిప్రాయాలు వస్తున్నాయి. నిజానికి సినిమా పరంగా చూసుకుంటే.. జెమినీ పాత్రను ఇంతకంటే గౌరవంగా చూపించడం అసాధ్యమేమో అనిపించక మానదు. దుల్కర్ సల్మాన్ చేసిన పాత్ర పైకి అలా కనిపించవచ్చు కానీ.. అతడి క్యారెక్టర్ ను ఆవిష్కరించిన వైనం చాలా బాగుందనే మాట ఒప్పుకోవాలి. ముందు నుంచి సావిత్రిపై విపరీతమైన ప్రేమ చూపించాడు.. పెళ్లి అయిందని చెప్పే సావిత్రిని చేసుకుని.. నిజాయితీ ప్రదర్శించాడు. చివరకు విబేధాలు వచ్చి సావిత్రి అతడిని వద్దనుకున్నా.. పనివాళ్లతో బైటకు పంపేసినా సరే.. ఆమెపై ప్రేమ కురిపించనట్లుగానే సినిమాలో చూపారని గుర్తు చేస్తున్నారు నెటిజన్స్.

అంతే కాదు తాను దగ్గర లేకున్నా సావిత్రి చుట్టుపక్కల ఉన్నవాళ్లు మోసం చేస్తున్నారని హెచ్చరించాడు. సయోధ్య కోసం ప్రయత్నించినట్లుగా కూడా మహానటి మూవీలో చూపించారు. విడిగా బతుకున్నా సరే చావు బతుకుల్లో ఉన్నపుడు తోడుగా ఉన్నట్లుగా దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించాడు. సావిత్రి విషయంలో జెమినీ గణేశన్ రోల్ ను ఇంతకంటే ఎవరేం గొప్పగా చూపిస్తారెహ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English