ప్రియాంకను అలా ఉతికి ఆరేశారు

ప్రియాంకను అలా ఉతికి ఆరేశారు

టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ అంబాసిడర్ అయిపోయింది. యునెస్కో తరఫున ప్రచారం చేస్తూ.. ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. రీసెంట్ గా బంగ్లాదేశ్ రోహింగ్యా బాధితులను సందర్శించిన ఈమె.. వారిని పరామర్శించడమే కాకుండా.. వారికి తగిన మద్దతు ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను.. ఫాలోయర్స్ ను కోరింది.

స్టార్లు.. సెలబ్రిటీలు ఇలాంటి క్యాంపెయిన్స్ చేయడం సహజమే కాదనీ.. వీటిపై కాసింత అలర్ట్ గా ఉండాలి. ప్రచారం  వరకూ బాగానే ఉంటుంది కానీ.. ఆ తర్వాత వచ్చే విమర్శలను ప్రిపేర్డ్ గా ఉండాల్సి ఉంటుంది. ప్రియాంక ఇక్కడ చేసిన పొరపాటు అదే. హాలీవుడ్ వెళ్లిన తర్వాత ఆమెలో ఇలా మానవత్వం మేలుకొందా అని నిలదీస్తున్నారు సోషల్ మీడియా జనాలు. బంగ్లాదేశ్ లో పునరావాస కేంద్రాలలో బతుకుతున్న వారిని పరామర్శించేందుకు సమయం చిక్కిన ఈమెకు.. ఇండియాలో ఎందుకు ఇలాంటి ప్రాంతాలు కనిపించలేదని.. వారి బాధలు ఎందుకు గుర్తుకు రావడం లేదని నిలదీస్తున్నారు.

కాశ్మీరీ పండిట్ల క్యాంపులు ఇంతకంటే ఘోరంగా ఉంటాయనే విషయం తెలుసా అని కొందరు ప్రశ్నిస్తే.. గాజా-సిరియా బాధితుల గురించి తెలియదా అని నిలదీస్తున్నారు. మొత్తం ప్రపంచం సంగతి ఏమో కానీ.. ఇండియాలో బాధలు.. అసలు ముంబైలో ఉన్నపుడు ఎంతమంది కష్టాలను పట్టించుకున్నావని నిలదీస్తున్నారు నెటిజన్లు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు