క్యూట్ సమంత చంపేస్తోందిగా..

క్యూట్ సమంత చంపేస్తోందిగా..

కేవలం అందంతో.. అభినయంతో తెరమీద ఆకర్షించడమే కాదు.. తన వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుంటూ ఉంటుంది సమంత. ఆమె చిలిపితనం.. అల్లరి జనాలకు చాలా ఇష్టం. ఇవే ఆమెను కోట్ల మందికి చేరువ చేశాయి. ఈ తరంలో దక్షిణాదిన మరే కథానాయికకూ లేని స్థాయిలో జెన్యూన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఆఫ్ ద సినిమా సమంత చేష్టల్ని జనాలు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. తెర మీదే కాకుండా తెర వెనుక సమంత వేషాలు కూడా భలే ముచ్చటగొలుపుతుంటాయి.

సినిమాల చిత్రీకరణ సందర్భంగా ఆమె ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు ఎప్పుడు రిలీజ్ చేసినా  వైరల్ అయిపోతుంటాయి. ‘రంగస్థలం’లోని పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోలు ఎలా హల్ చల్ చేశాయో తెలిసిందే. తాజాగా ‘మహానటి’ నుంచి రిలీజ్ చేసిన వీడియో కూడా అలాగే ఆకట్టుకుంటోంది.

‘మహానటి’లో జర్నలిస్టు మధురవాణి పాత్రలో సమంత అభినయం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నత్తితో సాగే ఆ పాత్రకు సమంత తనదైన నటనతో జీవం పోసింది. ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోలో సమంత ఆన్ ద సెట్స్ అల్లరి అంతా కనిపిస్తోంది. మేకప్ కోసం.. డైలాగుల కోసం ఆమె ఎంత కష్టపడింది కూడా ఇందులో చూపించారు. వీడియో ఆద్యంతం సమంత తన క్యూట్‌నెస్‌తో చంపేసిందనే చెప్పాలి.

ఈమెకు తగ్గట్లే విజయ్ దేవరకొండ అనే అల్లరివాడు దొరకడంతో షూటింగ్ టైంలో వీళ్ల హంగామా మామూలుగా లేదనే చెప్పాలి. మొత్తంగా ఈ వీడియో జనాల్ని బాగా ఆకట్టుకుంటోంది. సినిమాలో తన పెళ్లికి ముందు ఒక మంచి కథ రాయాలంటూ సమంత తడబడుతూనే బలంగా చెప్పే ఒక డైలాగ్ ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు