మేనల్లుడు కాదు.. అల్లుడే విజేత

మేనల్లుడు కాదు.. అల్లుడే విజేత

మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నెన్నో మైలురాళ్ల వంటి సినిమాలు ఉన్నాయి. ఆ పేర్లతో ఇప్పుడు సినిమాలు చేయడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. ఆయన స్థాయికి తూగలేమనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే.. విజేత అనే టైటిల్ విషయంలో మాత్రం కొంత కాలంగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

విజేత అనే టైటిల్ ను తన సినిమాకు పెట్టుకోవాలని చాలా రోజుల నుండి సాయిధరమ్ తేజ్ ఆరాటపడుతున్నాడు. ఒకానొక సమయంలో ఇంటెలిజెంట్ మూవీ విషయంలో ఈ ప్రచారం కూడా జరిగింది. అయితే.. దీనిపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు. ఎప్పటికైనా సరే.. రామ చరణ్‌ తన సినిమాకు ఈ టైటిల్ ను పెట్టుకుంటే బాగుంటుందని చాలామంది సూచించారు. ఒక టైంలో అయితే.. ధృవ సినిమాకు మొదటగా ఈ పేరే పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ వేరే సినిమాకు వచ్చేసింది. ఇప్పుడు మెగావారి అల్లుడు కళ్యాణ్‌ దేవ్.. ఈటైటిల్ ను లాగేసుకున్నాడు.

కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్ ని నిర్ణయించారు. ఒక పిల్లాడికి హీరో చేయూత ఇస్తున్నట్లుగా చేతులు మాత్రమే కనిపించేలా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలా మేనల్లుడికి సెట్ కావాల్సిన విజేత టైటిల్.. చివరకు పిల్లను చేసుకున్న అల్లుడి తొలి సినిమాకు వెళ్లిపోయింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు