ముప్ఫై కోట్ల మహానటి

ముప్ఫై కోట్ల మహానటి

‘మహానటి’ సినిమా విడుదలకు ముందు ఈ చిత్ర వసూళ్ల గురించి అడిగితే.. మహా అయితే ఓ 20 కోట్ల షేర్ వసూలు చేస్తే గొప్ప అనేసి ఉంటారు చాలామంది. ఈ చిత్రానికి ఎంత మంచి టాక్ వచ్చినా వసూళ్లు ఏమంత గొప్పగా ఉండవనే అంచనా వేశారందరూ. ఇలాంటి సినిమాలు జనాల్ని థియేటర్లకు ఆకర్షించలేవన్న అభిప్రాయం మెజారిటీ జనాల్లో ఉంది.

కానీ ఆ అంచనాలు తప్పని రుజువు చేసింది ‘మహానటి’. అద్భుతమైన టాక్ రావడంతో ఈ చిత్రాన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. తొలి రోజు సాయంత్రం నుంచే థియేటర్లు ఫుల్ అయిపోయాయి. వీకెండ్.. వీక్ డేస్ అని తేడా లేకుండా మంచి వసూళ్లతో సాగిందీ చిత్రం. రెండో వారంలో ‘మహానటి’కి కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయని పరిస్థితి నెలకొంది. రెండో వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో సాగుతుండటం విశేషం.

ఇప్పటికే ‘మహానటి’ వసూళ్లు రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేయడం విశేషం. రెండో ఆదివారం అయ్యేసరికే ‘మహానటి’ షేర్ రూ.29 కోట్లు దాటింది. సోమవారం నాటికి రూ.30 కోట్ల మైలురాయిని కూడా టచ్ చేసింది. నైజాంలో రూ.8 కోట్లకు పైగా ఈ చిత్రం షేర్ సాధించడం విశేషం. ఉత్తరాంధ్రలో రూ.2.25 కోట్లు.. సీడెడ్లో రూ.1.7 కోట్లు.. మిగతా ఏరియాల్లో కలిపి రూ.5 కోట్లకు పైగా షేర్ సాధించింది ‘మహానటి’. అమెరికాలో ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల మార్కుకు అత్యంత చేరువగా ఉంది.

తమిళంలో సైతం ఈ చిత్రం బాగా ఆడుతోంది. అక్కడ రూ.2 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు సమాచారం. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ వాల్యూ రూ.20 కోట్లని అంచనా. కొన్ని ఏరియాల్లో తక్కువ మొత్తానికే సినిమాను అమ్మేయగా.. కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు అశ్వినీదత్. దాని వల్ల ఆయనకు మంచి ఫలితమే దక్కింది. విడుదలకు ముందు శాటిలైట్ రైట్స్ అమ్మకపోవడం కూడా మంచిదైంది. ఈ సినిమా మీద ఆయన రూ.15-20 కోట్ల మధ్య లాభం అందకుంటారని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English