సొంత స్క్రిప్టే.. నమ్మండి ప్లీజ్

సొంత స్క్రిప్టే.. నమ్మండి ప్లీజ్

మల్టీస్టారర్ మూవీలంటే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగానే ఉంటోంది. తమ అభిమాన హీరోలు ఇద్దరు వెండితెరపై ఒకేసారి కనిపించడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. కాకుంటే ఎటొచ్చీ మల్టీస్టారర్ సినిమాలకు కథ సిద్ధం చేయడమంటే ఓ ఛాలెంజ్ లాంటిది. అనుకున్న కథను తెరపై చక్కగా ప్రజంట్ చేస్తూనే హీరోల రోల్స్ కు సమాన న్యాయం చేశాడని అనిపించుకోవడం సులువేమీ కాదు.

టాలీవుడ్ లో తక్కువే అయినా బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ తెగ వస్తాయి. ప్రస్తుతం నాని - నాగార్జునలతో మల్టీస్టారర్ మూవీ డైరెక్ట్ చేస్తున్న శ్రీరాం ఆదిత్య దీనికి ఓ బాలీవుడ్ మూవీ నుంచే కథను తీసుకున్నాడనే టాక్ వినిపించింది. జానీ గద్దార్ మూవీ స్టోరీ లైన్ తో నాగ్ - నానిల సినిమా రూపొందుతోందనే ప్రచారం కొనసాగింది. దీనిపై శ్రీరాం ఆదిత్య సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తాను నాగ్ - నానిలతో తీస్తున్న సినిమా ఏ మూవీకి రీమేక్ కాదని చెప్పుకొచ్చాడు. ఇది సొంతంగా ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ అంటూ ట్టిటర్ ద్వారా అందరికీ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు.

మహానటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ - నానిల మల్టీస్టారర్ వస్తోంది. ఇందులో నాని పక్కన ఛలో బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తోంది. నానికి స్టార్ హీరోగా గుర్తింపు వచ్చాక చేస్తున్న మల్టీస్టారర్ ఇదే.  
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు