ఎన్టీఆర్ మూవీలో ఆమె రీఎంట్రీ లేనట్లే

ఎన్టీఆర్ మూవీలో ఆమె రీఎంట్రీ లేనట్లే

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. అరవింద సమేత వీర రాఘవ అంటూ టైటిల్ ను అనౌన్స్ చేయడం మాత్రమే కాదు.. ఎన్టీఆర్ కు సంబంధించిన పలు పోస్టర్లను కూడా విడుదల చేశారు యూనిట్.

సీనియర్ భామలకు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చి ఆకట్టుకుంటున్న త్రివిక్రమ్.. ఈ సినిమాతో మాజీ హీరోయిన్ రంభకు రీఎంట్రీ ఇప్పించనున్నాడని టాక్  వినిపించింది. అయితే.. ఇప్పుడీమె రీఎంట్రీ కష్టమే అంటున్నారు. ఆమె పేరు పరిశీలించిన మాట వాస్తవమే అయినా.. రంభ ప్రస్తుతం గర్భవతి  కావడంతో.. ఈ ప్రతిపాదన ఉపసంహరించుకున్నారట. ఈమెకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ఇప్పుడు మూడోసారి గర్భవతిగా ఉంది. అందుకే ఆమెను మూవీలోకి తీసుకునే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

అయితే.. అరవింద సమేత చిత్రంలో రంభ కోసం అనుకున్న పాత్ర చాలా బాగుంటుందిట. అందుకే ఆమె కాకున్నా.. దాదాపు ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న మరో సీనియర్ బ్యూటీ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉండగా.. వీరిలో ఒకరిని ఖాయం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు