ఈ హీరోని ఎక్కువ అంచనా వేస్తున్నారా?

ఈ హీరోని ఎక్కువ అంచనా వేస్తున్నారా?

బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని ఎంత ఘనంగా లాంఛ్‌ చేసారనేది తెలిసిందే. బయ్యర్లకి తక్కువ రేట్లకే అమ్మిన అల్లుడు శీను వాళ్ల పరంగా సక్సెస్‌ అనిపించుకుంది కానీ నిర్మాతగా సురేష్‌కి నష్టాలే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతను హీరోగా నటించిన స్పీడున్నోడు అయితే సోదిలో లేకుండా కొట్టుకుపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకీ నాయక'కి మాస్‌నుంచి మంచి స్పందనే వచ్చినా కానీ భారీ బడ్జెట్‌ వల్ల నష్టాలు తప్పలేదు.

ఇంతవరకు హీరోగా పాతిక కోట్లకి మించి వసూలు చేసిన సత్తా లేకపోయినా కానీ మరోసారి అతని సినిమాపై భారీ పెట్టుబడి పెట్టేసారు. సాక్ష్యం చిత్రానికి బడ్జెట్‌ ముప్పయ్‌ అయిదు కోట్లు పైమాటే అంటున్నారు. దర్శకుడు శ్రీవాస్‌కి కూడా మార్కెట్లో అంత క్రేజ్‌ లేదు. మరి ఏ ధైర్యంతో ఈ చిత్రంపై ఇంత ఖర్చు పెట్టారనేది నిర్మాతలకే తెలియాలి. అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి బ్యాక్‌ ఎండ్‌లో బెల్లంకొండ సురేష్‌ ఫండింగ్‌ వుందనే పుకార్లున్నాయి. ప్రతి సినిమాతోను మిడిల్‌ రేంజ్‌ హీరోలకి దాదాపు డబుల్‌ ఖర్చుతో వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈసారి అయినా తనపై పెడుతోన్న పెట్టుబడికి తగ్గ విజయాన్ని సాధిస్తాడా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు