ఆమె తప్పుకోవడంపై మాస్ రాజా..

ఆమె తప్పుకోవడంపై మాస్ రాజా..

మాస్ రాజా రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుంచి హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ తప్పుకోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర యుఎస్ షెడ్యూల్ కోసం రెండు నెలల పాటు ఏకమొత్తంగా డేట్లు సర్దుబాటు చేయలేకే అను తప్పుకున్నట్లుగా చిత్ర బృందం చెప్పుకుంది. కానీ ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ లాంటి డిజాస్టర్లు ఎదురైన నేపథ్యంలో ఈ చిత్ర బృందమే ఎక్కువ డేట్లు అడగడం ద్వారా ఆమెను ఇరుకున పెట్టి సాగనంపేసింద్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అను తప్పుకోవడంపై రవితేజే స్వయంగా క్లారిటీ  ఇచ్చే ప్రయత్నం చేశాడు. అను తప్పుకోవడానికి డేట్ల సమస్యే కారణం తప్ప మరేదీ కాదన్నాడు.

అను ప్రస్తుతం ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలోనూ నటిస్తోందని.. తమ సినిమాకు ఎక్కువ డేట్లు అడిగామని.. అవన్నీ ఇచ్చేస్తే ఆ సినిమా ఆలస్యమవుతుందని.. ఆ చిత్రంలో అను ఇప్పటికే నటిస్తోంది కాబట్టి దానికి ఇబ్బందవుతుందన్న ఉద్దేశంతోనే ఆమె తమ సినిమా నుంచి తప్పుకుందని మాస్ రాజా అన్నాడు. అను చక్కటి హీరోయిన్ అని.. ఆమెతో తర్వాత తప్పకుండా తాను ఒక సినిమా అయినా చేస్తానని రవితేజ చెప్పాడు.

ఐతే అను స్థానంలో ఇలియానాను తీసుకుంటున్న సంగతి మాత్రం మాస్ రాజా ధ్రువీకరించలేదు. ఇలియాతో ఇంతకుముందు ‘ఖతర్నాక్’.. ‘కిక్’.. ‘దేవుడు చేసిన మనుషులు’ లాంటి సినిమాలు చేశాడు రవితేజ. ఇందులో ‘కిక్’ తప్ప మిగతావి డిజాస్టర్లయినప్పటికీ ఇలియానాను స్వయంగా రవితేజే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కి ఆమెను రికమండ్ చేశాడని.. అతనే ఇలియానాతో మాట్లాడి ఈ సినిమాకు ఒప్పించాడని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు