పూరి-నాగ్.. నిజమేనా?

పూరి-నాగ్.. నిజమేనా?

పూరి జగన్నాథ్ మీద ఏమైనా నమ్మకాలుంటే వాటిని ‘మెహబూబా’ పూర్తిగా పోగొట్టేసింది. నిజానికి ‘పైసా వసూల్’తోనే ఆయన పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ తన గత సినిమాల ఛాయల్లోకి పోకుండా భిన్నమైన నేపథ్యంలో ‘మెహబూబా’ తీసేసరికి ఆయనేమైనా మారాడేమో.. మళ్లీ తన ముద్ర చూపిస్తాడేమో అన్న ఆశ కలిగింది. దీనికి తోడు దిల్ రాజు ‘గొప్పలు’ కూడా సినిమాపై ఆశలు పెంచుకునేలా చేశాయి.

కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ‘మెహబూబా’ కూడా తుస్సుమనిపించింది. దెబ్బకు పూరి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇక పూరిని నమ్మేవాళ్లెవ్వరూ కనిపించడం లేదు. ప్రేక్షకులకే కాదు.. ఇండస్ట్రీ జనాలకు కూడా ఆయన మీద నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలో పూరితో సినిమా చేయడానికి ఎవరు ముందుకొస్తారన్నది సందేహంగా మారింది.

నిజానికి పూరి తన తర్వాతి రెండు సినిమాలను కూడా తన కొడుకుతోనే చేయాల్సి ఉంది. ఐతే ప్రతిభావంతుడిలా కనిపిస్తున్న ఆకాశ్‌ కెరీర్‌కు పూరీనే గండి కొడతాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆల్రెడీ ‘మెహబూబా’ లాంటి సినిమాతో కొడుకు కెరీర్‌కు పేలవ ఆరంభాన్నిచ్చాడు. పూరి ఇప్పుడున్న స్థితిలో ఇంకో రెండు సినిమాలు అతడితోనే చేస్తే అతడి కెరీర్ ఏమవుతుందో అన్న భయాలున్నాయి. పూరి కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడ్డాడనే అంటున్నారు.

కొంచెం బ్రేక్ ఇచ్చి బయటి సినిమా ఒకటి చేద్దామని పూరి చూస్తున్నాడట. ‘మెహబూబా’ విడుదలకు ముందు ఆయన నాగార్జునకు ఒక కథ చెప్పారని.. నాగ్-నాగచైతన్య కలిసి నటించాల్సిన కథ అని.. నాగ్ అప్పటికి సుముఖంగానే కనిపించాడని సమాచారం. కాకపోతే ‘మెహబూబా’ తర్వాత ఆయన ఆలోచన మారి ఉంటుందని అంటున్నారు. పూరి మాత్రం నాగ్ ఛాన్సిస్తాడన్న ఆశతోనే ఉన్నాడట. మరి నాగ్ ఏం చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు