పవన్‌కళ్యాణ్‌ మిస్‌ అయిన మెగా సినిమా!

పవన్‌కళ్యాణ్‌ మిస్‌ అయిన మెగా సినిమా!

త్రివిక్రమ్‌ తప్ప స్టార్‌ డైరెక్టర్లతో పని చేయడని పవన్‌ అభిమానులు నొచ్చుకునేవారు. దర్శకులు తన దగ్గరకి వస్తే తప్ప వారితో పని చేయనని, తనంతట తానుగా ఎవరినీ సంప్రదించనని పవన్‌ అంటుంటాడు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్లిపోయిన పవన్‌ ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదు. కానీ ఒకవేళ పవన్‌ ఇప్పటికీ సినిమాలు చేస్తుంటే మాత్రం ఒక మెగా సినిమా అతడిని వరించి వెళ్లేదని సమాచారం. వరుసగా నాలుగు పెద్ద హిట్లు ఇచ్చిన కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేయబోతున్నాడు.

యువ హీరోలు అందరినీ కాదని చిరంజీవి దగ్గరకి కొరటాల వెళ్లడం ఆశ్చర్యంగా వుంది. అయితే నిజానికి పవన్‌తో ఈ సినిమా చేయాలనేది కొరటాల ఆలోచన అట. ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌తో సినిమాలు చేసిన కొరటాలకి తర్వాత పవన్‌తో సినిమా చేద్దామని వుండేదట. అయితే పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, తను కమిట్‌ అయిన వేరే హీరోలు కూడా బిజీగా వుండడంతో ఆ కథని చిరంజీవికి అనుగుణంగా మారుస్తున్నాడట.

చిరంజీవికి కూడా మహేష్‌, పవన్‌లకి తీసిపోని మార్కెట్‌ వుంది. చిరుతో సినిమా అంటే ఖచ్చితంగా బిజినెస్‌ క్రేజ్‌ భారీగా వుంటుంది. అందుకే వేరే యువ హీరోలని కన్సిడర్‌ కూడా చేయకుండా చిరంజీవితో సినిమా కమిట్‌ అయ్యాడని తెలిసింది. ఈ చిత్రం ఇంకా అఫీషియల్‌ కాలేదనుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు