రష్మీ ఇమేజ్ ను వాడుకున్న ఎన్నారైలు

రష్మీ ఇమేజ్ ను వాడుకున్న ఎన్నారైలు

జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా అనూహ్య‌మైన పాపులారిటీని సంపాదించుకున్న ర‌ష్మి గౌతం సోష‌ల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ ప‌లు ప్రైవేట్ ఈవెంట్ల‌కు కూడా హాజ‌రు అవుతున్న ర‌ష్మిని తాజాగా ఓ కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు..అందులోనూ ఎన్నారైల నుంచి ఊహించ‌ని షాక్ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

దీంతో అవాక్కైన ర‌ష్మి అనుమ‌తి లేనిది ఎందుకు ఫోటో వేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ ఆమె ఆగ్ర‌హానికి కార‌ణం ఏంటంటే..ఓ ఎన్నారై సంఘం త‌మ కార్య‌క్ర‌మాల్లో భాగంగా  ప్ర‌భాస్‌తో క‌లిపి ఫోటో వేయ‌డం. అందుకు త‌న అనుమ‌తి తీసుకోలేకపోవ‌డం.

అమెరికాలో ఉండే ప్ర‌వాసులు ప‌లు సంద‌ర్భాల్లో వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండే సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ ఏడాది నాటా సంస్థ‌ ఈ ఏడాది ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి అతిథులుగా హీరో ప్ర‌భాస్‌, యాంక‌ర్ ర‌ష్మి స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్న‌ట్లు పేర్కొంటూ ప్ర‌చారం చేసింది.

ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆ ప్ర‌చారం వైర‌ల్ అయింది. అయితే స‌ద‌రు ప్ర‌చారం ఆనోటా ఈనోటా ర‌ష్మి దృష్టికి చేరింది. దీంతో ఆమె భ‌గ్గుమంది. ప్ర‌భాస్‌తో త‌న ఫోటో వేయ‌డం గురించి కాదు. ఈ కార్య‌క్ర‌మం గురించి అస‌లు త‌న‌కు ఎవ‌రూ ఆహ్వాన‌మే అందించ‌లేద‌ని, దానికి హాజ‌ర‌వుతున్న‌ట్లు త‌ను చెప్ప‌నే లేద‌ని పేర్కొంటూ అలాంప్పుడు త‌న పేరుతో ఎలా ఆహ్వానం ఇస్తార‌ని ఫైర్ అయింది.

ఈ మేర‌కు ఓ ట్వీట్ చేస్తూ ``ఈ ఈవెంట్ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాంటిది నా అనుమతి లేకుండానే నా ఫొటో వేసేశారు. ఇలా ఎలా వేస్తారు?    టోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చెక్ చేయరా?  నిర్వాహ‌కులు ఇలాంటి అంశాల గురించి ఎందుకు ఆలోచించ‌రు' అంటూ మండిపడింది. ర‌ష్మి రిప్లై సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English