అర్జున్ రెడ్డి దెబ్బతో RX100 రచ్చ

అర్జున్ రెడ్డి దెబ్బతో RX100 రచ్చ

మిగిలిన వాళ్ల సంగతేమో కానీ.. సినిమాలకు సీజన్ ఉంటుందనే విషయం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. ఒక తరహా కంటెంట్ క్లిక్ అయిందంటే.. దానిని పోలినట్లుగా తర్వాత చాలా సినిమాలే వస్తుంటాయి. కానీ పోలికలు కనిపించినా.. వైవిధ్యంగా అనిపించేలా రూపొందించడం మాత్రం కత్తిమీద సాము వంటిదే.

RX100 అంటూ ఓ సినిమా వచ్చేస్తోంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరో పాత్రధారి కొత్త కుర్రాడు కార్తికేయ. హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ ట్రైలర్ లో కంటెంట్ చెప్పేందుకే దర్శకుడు అజయ్ భూపతి ట్రై చేసిన విధానం కనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే.. హీరో-హీరోయిన్ మధ్య రొమాన్స్ ను చూపించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. హీరో-హీరోయిన్ ఓపెన్ గా రొమాన్స్ చేసుకోవడం.. మూతి ముద్దులను కూడా పబ్లిక్ గా పెట్టేసుకోవడం వంటివి తెగ కనిపిస్తున్నాయి.

మూవీది పల్లెటూరి నేపథ్యం అనే సంగతి అర్ధం అవుతున్నా.. అమ్మాయిని కట్టేసి.. ఏదో రేప్ చేస్తున్నట్లు హింట్లు ఇవ్వడం లాంటివి కూడా ట్రైలర్ లో కనిపిస్తాయి. నిజానికి టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ కథలు కొత్త కాదు. కానీ ఇంతగా బోల్డ్ కంటెంట్ చూపించిన సినిమా అంటే.. ''అర్జున్ రెడ్డి'' అనే చెప్పాలి. బోల్డ్ గా ఎక్సపోజింగ్ ను హద్దులు మీరేలా చేయడంలో.. సింపుల్ సీన్లో కూడా బూతులు మాట్లాడేసి సన్నివేశాన్ని రక్తి కట్టించడంలో.. అర్జున్ రెడ్డి మూవీ ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు RX100 మూవీ.. ఇందుకు పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది అన్నట్లుందిగా ఉంది అనడంలో సందేహం లేదు.

కానీ కంటెంట్ తో మెప్పిస్తే.. పోలికలు పెద్ద విషయం ఏమీ కాదు. ఒకవేళ కంటెంట్ సింపుల్ గా కేవలం సీన్లలో మాత్రం అర్జున్ రెడ్డిని ఇనిస్పిరేషన్ గా తీసుకుంటే.. అరుంధతి తరువాత వచ్చిన పంచాక్షరిలా ఉంటుంది పరిస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు