అరవింద సమేత.. ఇద్దరు ఎన్టీయార్లా??

అరవింద సమేత.. ఇద్దరు ఎన్టీయార్లా??

ఎన్టీఆర్ కొత్త సినిమా పేరు 'అరవింద సమేత.. వీర రాఘవ రెడ్డి'. యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ లోగోను రివీల్ చేశారు. రకరకాల లుక్స్ తో ఎన్టీఆర్ ను చూపించి.. ఫ్యాన్స్ ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెస్మరైజ్ చేశాడు. అయితే.. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన కథనం.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పైగా ఇదంతా ఆ మూవీ టైటిల్ లోగోను.. రిలీజ్ చేసిన పోస్టర్స్ ను బేస్ చేసుకునే జరుగుతున్న ప్రచారం కావడంతో.. అందరూ నిజమే అని అనుకుంటున్నారు కూడా.

అరవింత సమేత.. ఈ టైటిల్ లోగోను చూడగానే.. అత్తారింటికి దారేది అంటూ పవన్-త్రివిక్రమ్ మూవీ టైటిల్ లోగో గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. సమేత అన్న పదాన్ని డిజైన్ చేయడంలో.. దర్శకుడు చూపించిన ప్రతిభను.. ప్రత్యేకంగా ప్రస్తావించాలని అంటున్నారు. సమేతంగా అని అంటూనే.. వీర రాఘవ అనే పదాన్ని రెండుగా విభజించడం కనిపిస్తుంది. అంటే.. వీర.. రాఘవ.. ఇవి రెండు వేర్వేరు పాత్రలు అయ్యుంటాయి అనే ప్రచారం మొదలైంది. రెండు పాత్రలుగా కానీ.. ఫ్లాష్ బ్యాక్ లో వేరే కథ మాదిరిగా ఒకే పాత్ర రెండు రకాలుగా ప్రవర్తించే మాదిరిగా ఉండడం కానీ జరుగుతుందని నెటిజన్లు నమ్ముతున్నారట. ఈ మూవీ టైటిల్ లోగో డిజైన్ లో ఉన్న సీక్రెట్ ఇదేనంటూ ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు.  ఇక్కడ అరవింద సమేత అనగానే.. హీరోయిన్ తో కలిసి అనుకోవడం సహజం. అయితే.. సమేత అన్న పదాన్న కేవలం భాగస్వామికే కాదు.. సకుటుంబ సపరివార సమేతంగా అన్న రీతిలో ఉపయోగించడం మనకు అలవాటే.

ఇంతకీ ఆ అరవింద అనే పాత్ర ఎవరో తర్వాత చెప్పుకుందాం కానీ.. ఇప్పటికి అయితే.. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ లేదా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో చేయడం అయితే ఎంతవరకు కరక్ట్ అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు