ఆ ముద్దుల రచ్చ చేసే హీరోయిన్ ఎవరంటే..

ఆ ముద్దుల రచ్చ చేసే హీరోయిన్ ఎవరంటే..

టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. అటు కంటెంట్ పరంగాను.. ఇటు డ్యురేషన్ విషయంలోనూ ఈ చిత్రం ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. లెంగ్తీ సినిమాలను జనాలు ఇష్టపడరు అనే ఫీలింగ్ ను పటాపంచలు చేసిపారేసింది. పైగా ఏ సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన ఓవర్సీస్ లో డబ్బులు రావనే భావనకు కూడా తెరవేసింది అర్జున్ రెడ్డి.

ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత ముఖ్యమో.. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పాలి. హీరో క్యారెక్టరైజేషన్ ఎంత ఇండివిడ్యుల్ గా ఉన్నా సరే.. హీరోయిన్ లింక్ తోనే సినిమా అంతా రన్ అవుతుంది. కొత్తమ్మాయ్ షాలిని పాండే ఈ సినిమా కోసం పెట్టిన పెదాల ముద్దులు అన్నీ ఇన్నీ కాదు. విజయ్ దేవరకొండతో సమానంగా షాలిని కూడా అదరగొట్టింది. ఇప్పుడీ మూవీని వివిధ భాషల్లోకి రీమేక్ చేస్తుండగా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. అలాంటప్పుడు హీరోయిన్ ఎవరనే ఆలోచన రావడం సహజం. టాలీవుడ్ లో అంటే బోల్డ్ కంటెంట్ తో మెప్పించేందుకు సందేహించే భామలు ఉంటారు కానీ.. బాలీవుడ్ లో ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ అర్జున్ రెడ్డి రీమేక్ విషయానికి వస్తే మాత్రం.. హీరోయిన్ ఎంపికలో అలర్ట్ చాలానే అవసరం.

తెగ తర్జన భర్జనలు చేసిన తర్వాత.. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కోసం.. తార సుతారియా అనే యాక్ట్రెస్ ను ఫైనల్ చేశారు. డిస్నీ ఛానెల్ ఇండియాకు వీజే ఈమెకు బాగానె గుర్తింపు ఉంది. బుల్లితెరపై 7 ఏళ్లుగా సందడి చేస్తున్న ఈ భామ.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతోనన్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఈమెకు హిందీ అర్జున్ రెడ్డి సెకండ్ ప్రాజెక్ట్ అయినా.. పర్ఫెక్ట్ ఛాయిస్ అనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ ముద్దుల రచ్చ ఎలా ఉంటుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు