18 కోట్లు పెట్టేసిన సురేష్‌ బాబు బ్యాచ్

18 కోట్లు పెట్టేసిన సురేష్‌ బాబు బ్యాచ్

'పడి పడి లేచె మనసు' అంటూ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్- సాయిపల్లవి జంటగా ఓ చిత్రం శరవేగంగా రూపు దిద్దుకుంటోంది. ఇప్పటికే బిజినెస్ వ్యవహారాలు కూడా ఓ కొలిక్కి వచ్చేశాయని అంటున్నారు. దర్శకుడు ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా.. శర్వా-సాయి పల్లవి కాంబినేషన్ పై మాత్రం విపరీతమైన బజ్ నెలకొంది.

ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. సురేష్ బాబు- సునీల్ నారంగ్ లు.. పడి పడి లేచె మనసు థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేశారని గతంలోనే చెప్పుకున్నాం. అయితే.. ఇప్పుడీ డీల్ ఎంత అనే సంగతి బయటకు వచ్చింది. ఈ చిత్రం కోసం 18 కోట్లను వెచ్చించారట సురేష్ బాబు- సునీల్ నారంగ్. శర్వా సినిమాకు ఇది పెద్ద మొత్తం అనిపించవచ్చు కానీ.. సరైన సినిమాతో తను ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టగలడో శతమానం భవతితో చూపించాడు శర్వా. ఈ సినిమాకు మరో అట్రాక్టివ్ పాయింట్ కూడా తోడయిందిలే. సాయి పల్లవి క్రేజ్ కూడా శర్వా లేటెస్ట్ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరగడానికి కారణంగా చెప్పవచ్చు.

తను ప్రేమించిన వ్యక్తులను తరచుగా మరచిపోయే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటిస్తోందని.. సినిమా కథకు కీలకమైన పాయింట్ ఆమె చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. మరోవైపు.. పడి పడి లేచె మనసు చిత్రం ద్వారా హీరో సునీల్ మరోసారి కమెడియన్ గా అవతారం ఎత్తబోతుండడం కూడా.. ఆసక్తి కలిగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు