సో.. ఆమె ప్రెగ్నెంట్ కాదన్నమాట

సో.. ఆమె ప్రెగ్నెంట్ కాదన్నమాట

ఎలాటి ఆధారాలు లేకుండా కొత్త పుకార్లు పుట్టించేందుకు మీడియా వెనకాడకపోవడం గత కొంతకాలంగా బాగా ఎక్కువైపోయింది. ఇలా వినిపించిన రూమర్లలో.. ఇలియానా గర్భవతి అనే వ్యవహారం కూడా ఉంది. నిజానికి ఆండ్రూ నీ బోన్ అనే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న ఇల్లీ బేబీ.. కొద్ది కాలం క్రితమే తామిద్దరం లైఫ్ పార్ట్నర్స్ అనే విషయాన్ని బైట పెట్టింది.

కాకపోతే.. అప్పటికే జనాల దగ్గర కాసింత క్లారిటీ ఉండడంతో ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇలియానా ప్రెగ్నెంట్ అనే టాక్ మాత్రం బాగానే వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఇల్లీ వ్యవహారం చూస్తుంటే ఇదంతా అబద్ధం అనే సంగతి తేలిపోతోందిలే.

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా హీరోయిన్ అనే సంగతి.. ఇప్పుడు అధికారికం అయిపోయింది. ఆరేళ్ల తర్వాత టాలీవుడ్ మూవీ అంగీకరించిన ఈ గోవా బ్యూటీ.. నాలుగోసారి రవితేజతో జట్టు కట్టనుంది. ఒకవేళ రీసెంట్ ప్రచారం ప్రకారం.. ఇలియానా ప్రెగ్నెంట్ అనే మాట నిజం అయి ఉంటే.. ఇలా సెట్స్ మీద ఉన్న సినిమాను అంగీకరించేది కాదు.. మరోవైపు తాను గర్భవతిని కాదంటూ.. ఇల్లీ స్వయంగా చెప్పేసిన తర్వాత ఇలాటి మాటలకు చెక్ పడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు