దెబ్బలు తిన్న బన్నీ.. పద్దతి మార్చాడు

దెబ్బలు తిన్న బన్నీ.. పద్దతి మార్చాడు

సినిమా ఇండస్ట్రీలో కథలు ఎంచుకోవడంలో ఒక్కోరిదీ ఒక్కో తీరు. అల్లు అర్జున్ కు కథ చెప్పడం అంటే.. దర్శకులకు మహా సంక్లిష్టమైన విషయం. ఇందుకు కారణం.. మధ్యలో ఉండే వ్యక్తులు. నిజానికి వీరేమీ మధ్యవర్తులు కాదు.. బన్నీ ఫ్రెండ్స్ కం నమ్మకస్తులు అంతే.

ఓ కథ అల్లు అర్జున్ చెవిన పడాలంటే.. ముందుగా అతని టీంలోని వ్యక్తులను ఒప్పించాలి. వారిని మెప్పించగలిగితేనే.. స్టోరీ విషయమై బన్నీ అపాయింట్మెంట్ అండ్ టైం చిక్కుతాయి. అప్పుడు తమ నెరేషన్ తో స్టైలిష్ స్టార్ ని ఫ్లాట్ చేయగలగాలి. ఇదే కొత్త దర్శకులను బన్నీకి చాలా దూరంగా ఉంచే పాయింట్. వక్కంతం వంశీ కొత్త దర్శకుడే అయినా.. ఇండస్ట్రీకి కొత్త కాదు. పలు హిట్ సినిమాలకు స్టోరీ అందించిన స్టార్ రైటర్. ఈయనతో తీసిన నా పేరు సూర్య కారణంగా.. బన్నీ మారాడట. సహజంగా తను మొదటగా కథలు వినడానికి అంగీకరించని బన్నీ.. ఇప్పుడు మాత్రం ఛేంజ్ చూపిస్తున్నాడట.

ఇండస్ట్రీకి పూర్తిగా కొత్త దర్శకులు అయినా.. రైటర్ అయినా కథలు తీసుకొస్తే.. వారిని పూర్తిగా దూరం పెట్టేయడం లాంటివి చేయడం లేదని తెలుస్తోంది. తనకు స్క్రిప్ట్ కు సంబంధించిన సినాప్సిస్ ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నాడట బన్నీ. దీంతో పలువురికి బన్నీని నేరుగా యాక్సెస్ చేయగలిగే అవకాశం ఏర్పడుతోంది. తనకు కూడా కొత్త తరహా క్యారెక్టర్లు పరిచయం అయేందుకు ఇది చక్కని మార్గం అని ఫిక్స్ అయ్యాడట స్టైలిష్ స్టార్.