మహేష్‌... ఎప్పుడూ చూడనట్టుగా

మహేష్‌... ఎప్పుడూ చూడనట్టుగా

మహేష్‌ అన్ని సినిమాల్లోను ఒకేలా కనబడుతున్నాడనే విమర్శ వుంది. దీనికి తన ఇరవై అయిదవ చిత్రంలో ఇవ్వాలని మహేష్‌ డిసైడ్‌ అయ్యాడు. ఇంతవరకు కనిపించని విధంగా ఈ చిత్రంలో మహేష్‌ కనిపించబోతున్నాడు. అరవింద సమేత... కోసం ఎన్టీఆర్‌ ఫిట్‌గా తయారైనట్టు ఈ చిత్రం కోసం మహేష్‌ కూడా వర్కవుట్స్‌ చేయబోతున్నాడట. భరత్‌ అనే నేను తర్వాత విదేశాలకి ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లిన మహేష్‌ ఇంకా తిరిగి రాలేదు. వచ్చిన తర్వాత ట్రెయినర్‌ని పెట్టుకుని వర్కవుట్స్‌ మొదలు పెడతాడట.

కేవలం ఫిజికల్‌గానే కాకుండా లుక్స్‌ పరంగాను మహేష్‌ ఇందులో కొత్తదనం చూపిస్తాడట. ఇందుకోసం కొన్ని స్కెచెస్‌ కూడా వేయిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు కానీ తొందర వద్దని, టైమ్‌ తీసుకుని చేద్దామని మహేష్‌ చెప్పాడట. వచ్చే వేసవికి విడుదల చేసేలా టార్గెట్‌ చేయాలని చెప్పడంతో ఆ విధంగా రీషెడ్యూల్‌ చేసుకున్నారట.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు కాగా, దిల్‌ రాజు, అశ్వనీదత్‌ నిర్మాతలు. సమ్మర్‌లో వచ్చిన మహేష్‌ చిత్రాలు పోకిరి, భరత్‌ అనే నేను హిట్‌ అయ్యాయి కనుక సెంటిమెంట్‌ ప్రకారం దీనిని కూడా సమ్మర్‌కే ప్లాన్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు