పవన్‌, అల్లు అర్జున్‌ షాక్‌లతో ఆమెకి ట్రబుల్‌

పవన్‌, అల్లు అర్జున్‌ షాక్‌లతో ఆమెకి ట్రబుల్‌

కెరియర్‌ ఆరంభంలోనే ఇద్దరు టాప్‌ హీరోలతో నటించే అవకాశం రావడంతో అను ఎమాన్యుయేల్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని అనుకున్నారు. కానీ అనుకి కాలం కలిసి రాలేదు. ఆక్సిజన్‌లాంటి డిజాస్టర్‌ పడినా కానీ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య చేతిలో వున్నాయని ఆనందపడింది. కానీ ఆ రెండు చిత్రాలు పెద్ద ఫ్లాప్‌ అవడంతో అనుపై ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర పడింది. దీంతో ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారుతున్నాయి.

రవితేజతో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని' చిత్రంలో ఒక కథానాయికగా ఎంపికైన అను ఒక రోజు షూటింగ్‌లోను పాల్గొంది. కానీ ఆ తర్వాత ఆ చిత్రం నుంచి తప్పుకుంది. డేట్స్‌ క్లాష్‌ అవడం వల్ల అవకాశం వదులుకున్నానని ఆమె చెబుతోంది కానీ ఆమె చేతిలో అన్ని సినిమాలేం లేవు. నాగ చైతన్యతో సవ్యసాచి చిత్రంలో నటిస్తోంది తప్ప అనుకి డేట్స్‌ క్లాష్‌ అయ్యేటన్ని ఆఫర్లు లేవు. మైత్రి మూవీస్‌ వాళ్లు కూడా ఆమె కెరియర్‌కి ఇబ్బంది కాకూడదనేమో తనంతట తానుగానే ఈ చిత్రం నుంచి తప్పుకుందని చెబుతున్నారు.

గతంలో కూడా వీరి చిత్రంలో ఒక హీరోయిన్‌ ఛాన్స్‌ కోల్పోతే ఈ విధంగానే చెప్పారు. దీనిని బట్టి క్లియర్‌గా అను ఎమాన్యుయేల్‌ వుంటే సినిమా ఫ్లాప్‌ అనే ఇంప్రెషన్‌ ఇండస్ట్రీలో పడిపోయిందనేది స్పష్టమవుతోంది. ఈ ముద్ర ఒకసారి పడిందంటే దానిని పోగొట్టుకోవడం చాలా కష్టం. మరి అనుని ఈ కష్టాల నుంచి సవ్యసాచి గట్టెక్కిస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు