క్యారెక్టర్‌ నటితో హిట్‌ దర్శకుడి షికార్లు!

క్యారెక్టర్‌ నటితో హిట్‌ దర్శకుడి షికార్లు!

అతడు వరుసగా రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కాలం వేచి చూసిన తర్వాత అతనికి సక్సెస్‌ వచ్చింది. ఆ వెంటనే వచ్చిన మరో అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. అతని వయసు మిడ్‌ థర్టీస్‌ అయినా కానీ ఇంకా పెళ్లి కాలేదు. లేడీ ఆర్టిస్టులతో అతను మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తాడనే గుసగుసలున్నాయి.

అలాగే ఒక యువ క్యారెక్టర్‌ నటికి తన రెండవ చిత్రంలో చాలా పెద్ద క్యారెక్టరే ఇచ్చి ఎంకరేజ్‌ చేసాడు. ఆమె త్వరలో విడుదల కాబోతున్న మూడవ చిత్రంలోను ఒక పాత్ర పోషించింది. వరుస అవకాశాలిస్తూ ఆ అమ్మాయిని ఎంకరేజ్‌ చేస్తోన్న సదరు దర్శకుడు షూటింగ్స్‌ లేని సమయంలోను ఆమెతో కలిసి కనిపిస్తున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతే కాదు ఆమెకి అతని కుటుంబ సభ్యులతో కూడా మంచి రిలేషన్‌ వుందట. అతని ఫ్యామిలీ ఈవెంట్స్‌లో, పార్టీస్‌లో కూడా ఆమె కనిపిస్తున్నట్టు భోగట్టా.

ఈ దర్శకుడు సెట్లో ఆడవాళ్లతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడని అతని మూడవ చిత్రం హీరో కూడా సరదాగా కామెంట్‌ చేసాడు. మొదటి రెండు సినిమాలతో హిట్లయితే కొట్టాడు కానీ ఈ దర్శకుడికి ఇంకా స్టార్‌ స్టేటస్‌ రాలేదు. మూడవ చిత్రం కూడా సక్సెస్‌ అయితే బాగా బిజీ అయిపోతాడేమో. అయితే ఈలోగా అతనిపై ఇలాంటి పుకార్లు కెరియర్‌కి చేటు చేస్తుందేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు