కూతురి కోసం టాప్‌ హీరో రికమండేషన్‌

కూతురి కోసం టాప్‌ హీరో రికమండేషన్‌

కూతుళ్లని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సౌత్‌ హీరోలు తటపటాయిస్తుంటారు కానీ నార్త్‌లో ఇదంతా మామూలే. బాలీవుడ్‌లో బిజీగా వున్న చాలా మంది హీరోయిన్లు ఎవరో ఒక హీరో లేదా దర్శకుడి కూతురు లేదా మనవరాలే. హీరోల కూతుర్లంతా బాలీవుడ్‌ని ఆకర్షించడానికి టీనేజ్‌లోనే సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో హల్‌చల్‌ చేయడం కూడా షరా మామూలే.

అలా తొలి సినిమా మొదలైనా కాకముందే జనం దృష్టిలో గ్లామర్‌ క్వీన్‌ అనిపించుకున్న సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ ఎప్పుడో హీరోయిన్‌ అయిపోవాల్సింది. కానీ ఆమె చేపట్టిన సినిమాలన్నీ డిలే అవడంతో సారా ఇంకా తనని తాను వెండితెరపై చూసుకోలేకపోయింది. ఆమె కమిట్‌ అయిన కేదార్‌నాధ్‌ అనే సినిమా నిర్మాణ దశలో ఇబ్బందుల్లో పడడంతో కూతురికి అవకాశం ఇప్పించడానికి సైఫ్‌ రంగంలోకి దిగాడు.

కరణ్‌ జోహార్‌తో మాట్లాడితే అతను కో ప్రొడ్యూస్‌ చేస్తోన్న 'సింబా' చిత్రంలో సారాకి హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం సారాకి గ్రాండ్‌ లాంఛ్‌ వెహికల్‌ అవుతుంది. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ ఎంత క్రేజీ అనేది తెలిసిందే. దానికి తోడు రోహిత్‌ శెట్టి కూడా అత్యధిక విజయాలు అందించిన దర్శకుడాయె.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English