వారసులకు ఇదే అడ్వాంటేజ్ మరి

వారసులకు ఇదే అడ్వాంటేజ్ మరి

స్టార్ డాటర్ సారా అలీ ఖాన్ తెరంగేట్రం ఖాయం అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టెంపర్ మూవీని హిందీలో దర్శకుడు రోహిత్ శెట్టి రీమేక్ చేస్తుండగా.. ఈ సినిమాలో హీరోగా రణవీర్ సింగ్.. హీరోయిన్ గా సారా నటిస్తున్నారు. నిజానికి ఓ కొత్త హీరోయిన్ కు లాంఛింగ్ ప్యాడ్ అయ్యేంత గొప్పగా కాజల్ క్యారెక్టర్ టెంపర్ లో ఉండదు. అందుకే కొంచెం ఈ పాత్రను ఛేంజ్ చేస్తున్నారట.

అలా కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ బడా ప్రాజెక్టు ద్వారా సారా ఎంట్రీ ఇస్తోంది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కేదార్నాథ్ అనే సినిమా ద్వారా సారా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టు ఆరంభం కూడా కాకుండానే.. దర్శక నిర్మాతల మధ్య విబేధాలతో ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితి వేరే కొత్త హీరోయిన్ కు ఎదురైతే.. ఆ వివాదం తేలేవరకూ వేరే మూవీ చేయకుండా ఇరుక్కుపోయేది. కానీ ఇక్కడే తండ్రి సైఫ్ అలీ ఖాన్ రంగంలోకి దిగిపోయాడు. ఈప్రాజెక్టు నుంచి సారా అలీ ఖాన్ ను బయటకు తీసుకొచ్చేశాడు.

అంతే కాదు.. వెంటనే కరణ్ జోహార్ తో మాట్లాడి.. శింబ ప్రాజెక్టులో చోటు గురించి వాకబు చేశాడు. అప్పటికి హీరో హీరోయిన్లను కన్ఫాం చేయకపోవడంతో.. సారాకు వెంటనే లాంఛింగ్ కోసం ఓ ప్రాజెక్టులో అవకాశం దక్కింది. నిజానికి కేదార్నాథ్ ప్రాజెక్టులో సారా భాగం అయినపుడు.. సైఫ్ ఎలాంటి పాత్రను పోషించలేదు. కానీ ఆమె కెరీర్ ఆరంభంలోనే ఇబ్బంది ఎదురైనపుడు ఎంట్రీ ఇచ్చి తండ్రిగా తన బాధ్యతను పక్కాగా నిర్వహించేశాడు. మరి స్టార్ కిడ్స్ కు ఇదే కదా అడ్వాంటేజ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English