స్నేహాలను పెంచుకుంటున్న రామ్ చరణ్‌

స్నేహాలను పెంచుకుంటున్న రామ్ చరణ్‌

స్నేహాలను పెంచుకుంటున్న రామ్ చరణ్‌సినిమా జనాలు తెర వెనుక ఏం చేస్తారో పెద్దగా బయటకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఏ రోజుకు ఆ రోజు అప్ డేట్స్ శరవేగంగా వచ్చేస్తున్నాయి. స్టార్స్ కూడా తమ ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండేందుకు.. వీలైనంతగా ప్రయత్నిస్తున్నారు.

ఇలా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడం అనేది ఈ మధ్య ఎక్కువ అయినా.. తన యాక్టివిటీస్ లో కొత్త ట్రెండ్ కు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. తారక్ తో కలిసి రామ్ చరణ్ దిగిన ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే చెర్రీతో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఓ వీడియోను నెట్ లో పెట్టింది హీరోయిన్ కైరా అద్వానీ. ఈ రెండు ఇన్సిడెంట్స్ ను ఒక చోటకు చేర్చి చూస్తే.. సెట్స్ లో తనతో కలిసి నటిస్తున్న నటీనటులతో రామ్ చరణ్ ఎంత దగ్గర అవుతాడు అనే విషయంతో పాటు.. ఇండస్ట్రీ జనాలతోను తన స్నేహితులతోను ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

ఇండస్ట్రీలో ఇతర స్టార్ హీరోలతో మరో స్టార్ మరీ ఇంత క్లోజ్ గా ఉంటాడని తెలియడం కొత్త విషయమే. మరోవైపు.. తోటి హీరోయిన్ తో కలిసి వర్కవుట్స్ చేస్తుండడం.. అది కూడా షూటింగ్ ప్యాకప్ తర్వాత కావడం.. ఇవి నెట్ లోకి రావడం కూడా కొత్త విషయమే.  మొత్తం మీద తన రియల్ లైఫ్ యాక్టివిటీస్ తో చెర్రీ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English