సాహో కోసం కార్లు-ట్రక్కులు తుక్కు తుక్కు

సాహో కోసం కార్లు-ట్రక్కులు తుక్కు తుక్కు

బాహుబలి తర్వాత చాలా గ్రాండ్ గా తన తర్వాతి సినిమాను సిద్ధ చేస్తున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే గుర్తింపును కొనసాగించడం కోసం వీలైనంత కష్టపడుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సాహో విషయంలో కూడా.. మొదట అనుకున్నదాని కంటే బడ్జెట్ భారీగా పెరిగిన సంగతి గతంలోనే చెప్పుకున్నాం.

రీసెంట్ గా అబుదాబి షెడ్యూల్ కు షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు ప్రభాస్ అండ్ టీం. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. నీల్ నితిన్ ముకేష్.. ఎవ్లిన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిన సాహో టీం.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సహజంగా సినిమాల్లో 30 శాతం రియాలిటీ వెర్షన్ షూటింగ్ ఉంటుందని.. మిగిలిన 70 శాతం గ్రాఫిక్స్ ఉపయోగిస్తారని.. కానీ సాహోకు మాత్రం చాలా వరకు రియల్ గా షూటింగ్ చేశామని అంటున్నారు.

యాక్షన్ ఎపిసోడ్స్ అందిస్తున్న కెన్నీ బేట్స్ కు ఈ సీక్వెన్స్ గురించి 2 ఏళ్ల క్రితం చెప్పగా.. ఇక్కడ రెక్కీ అనంతరం తనకు నిజమైన కార్లు కావాలని చెప్పాడట. దాని ప్రకారమే షూటింగ్ చేసి 37 కార్లను.. అనేక ట్రక్కులను తుక్కు తుక్కు చేసేశారట. అంత భీకరంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ సాగనుందని చెబుతున్నారు. ఇదంతా కూడా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికే కావడమే అసలు హైలైట్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు