ఆ ముద్దుగుమ్మ‌ల క్రేజీ ఫోటో వెనుక అంత స్టోరీ

ఆ ముద్దుగుమ్మ‌ల క్రేజీ ఫోటో వెనుక అంత స్టోరీ

ఎవ‌రు న‌మ్మినా న‌మ్మ‌కున్నా.. సినిమా పోస్ట‌ర్ సినిమా మీద పెంచే అంచ‌నాలు అంతా ఇంతా కావు. సినిమా మీద ఎలాంటి అభిప్రాయాలు లేకున్నా.. పోస్టర్ పుణ్య‌మా అని సినిమా చూసేలా ప్ర‌భావితం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా ఒక పోస్ట‌ర్ ఒక బాలీవుడ్ మూవీపై ఉన్న ఇమేజ్ ను మార్చ‌ట‌మేకాదు.. ఆ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా? అన్న‌ట్లు ఎదురుచూసేలా చేసింది.

ఇంతా చేస్తే.. సినిమాకు కొత్త క్రేజ్ తీసుకొచ్చిన స‌ద‌రు ఫోటోలో ముద్దుగుమ్మ‌లు ధ‌రించిన క్యాస్టూమ్స్ ఏమీ సినిమాకు సంబంధం లేనివి కావ‌టం విశేషం. అంతేనా.. ఎవ‌రికి వారు వారి సొంత డ‌బ్బుల‌తో కొనుక్కొని ధ‌రించిన దుస్తులు ఒక సినిమా ఇమేజ్ ను ఎంత‌లా మార్చాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

వ‌చ్చే నెల‌లో (జూన్) రిలీజ్ కానున్న బాలీవుడ్ మూవీ వీరే ది వెడ్డింగ్‌. న‌లుగురు అమ్మాయిల స్నేహం.. వివాహ వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో స్టార్ భామ‌లు సోన‌మ్ క‌పూర్.. క‌రీనా క‌పూర్ తో పాటు స్వ‌రా భాస్క‌ర్.. శిఖా త‌ల‌సానియా ప్ర‌ధాన పాత్ర‌లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ కొంత‌కాలంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

సినిమా క్రేజ్ ను మార్చేసిన ఈ ఫోటోలో ఈ న‌లుగురు ముద్దుగుమ్మ‌లు స‌ముద్రం ద‌గ్గ‌ర బికినీలు వేసుకొని క‌నిపిస్తారు.

ఈ ఫోటో సినిమాకు కొత్త గుర్తింపు తేవ‌టంతో పాటు.. ఆస‌క్తిని రెట్టింపు అయ్యేలా చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ క్యాస్టూమ్స్ ను సినిమా కోసం కొన్న‌వి కావు. స‌ద‌రు ముద్దుగుమ్మ‌ల సొంత దుస్తులు. షూటింగ్ విరామంలో భాగంగా త‌మ వార్డ్ రోబ్‌లోని దుస్తుల్ని వేసుకొని అలా స‌ముద్రం ద‌గ్గ‌ర ఫోటోలు తీయించుకుంటున్నారు.

ఆ టైంలో చిత్ర ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఘోష్ చూసి.. న‌లుగురి భామ‌ల మ‌ధ్య‌నున్న బాండింగ్‌.. వారి దుస్తులు ఆయ‌న్ను విప‌రీతంగా ఆక‌ర్షించాయ‌ట‌. ఆయ‌న సూచ‌న మేర‌కు తీసిన ఫోటోల్ని సినిమా పోస్ట‌ర్ గా వాడారు. అవి ఇప్పుడు క్రేజ్ గా మారి.. సినిమాకు మీద అంచ‌నాలు పెరిగేందుకు ప్ల‌స్ అయ్యాయ‌ని చెబుతున్నారు. మ‌రి.. పోస్ట‌ర్ అద‌ర‌గొట్టిన భామ‌లు.. సినిమాతో మ‌రెంత‌గా అద‌ర‌గొడ‌తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు