2.0 టీజర్.. కొత్త రూమరొచ్చింది

2.0 టీజర్.. కొత్త రూమరొచ్చింది

2.0 సినిమా కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తిపోయి దాని గురించి మాట్లాడటమే మానేశారు జనాలు. ఆ చిత్ర దర్శక నిర్మాతలు కూడా దీని గురించి ఊసులే వదిలేసింది. కొన్ని నెలలుగా సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ ఇవ్వకుండా సైలెంటైపోయింది. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ‘2.0’ గురించి ఒక కొత్త రూమర్ బయటికి వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను ఇంకో వారం రోజుల్లోనే లాంచ్ చేయబోతున్నారట. ఇందుకు ఐపీఎల్ ఫైనల్ వేదిక కాబోతోందట.

ముంబయిలోని వాంఖడె స్టేడియంలో వచ్చే ఆదివారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ జరగబోతున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందు అదే స్టేడియంలో ‘2.0’ ఆడియోను రిలీజ్ చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తుండటం విశేషం.

ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్యలో సినిమా ప్రమోషన్లు చేయడం మామూలే. ఈ సందర్భంగా సినిమాల టీజర్లు.. ఇతర విశేషాలు పంచుకోవడం ఇంతకుముందు కూడా చూశాం. ఐతే ‘2.0’ సంగతి వేరు. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధికంగా రూ.400 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సినిమా టీజర్‌ను ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రిలీజ్ చేస్తే మోతెక్కిపోతుంది. ఈ ఐడియా వినడానికి బాగానే ఉంది. కానీ కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉండిపోయిన ‘2.0’ ఉన్నట్లుండి ఇప్పుడు హంగామాకు తెరతీస్తుందా అని చూడాలి. నిజంగా వచ్చే వారం టీజర్ రిలీజయ్యేట్లుంటే ఇంకొన్ని నెలల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు