అరవింద సమేత.. ఏమిటీ కన్ఫ్యూజన్?

అరవింద సమేత.. ఏమిటీ కన్ఫ్యూజన్?

ఒక సినిమాకు జనాల్ని ఆకర్షించే అంశాల్లో టైటిల్ కూడా ఒకటి. అందుకే దాని విషయంలో చాలా చాలా ఆలోచిస్తారు రచయితలు, దర్శకులు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల టైటిళ్ల విషయంలో ప్రతిసారీ తర్జన భర్జనకు గురవుతుంటాడు. ముందు కొన్ని టైటిళ్లు అనుకుని మీడియాకు లీకులిస్తాడు. వాటికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి చివరగా ఒకటి ఫైనలైజ్ చేస్తాడు.

ఎప్పట్లాగే ఎన్టీఆర్‌తో తాను చేస్తున్న కొత్త సినిమా విషయంలోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించాడు. మూణ్నాలుగు టైటిళ్లపై మీడియాలో చర్చ సాగింది. చివరికి ప్రచారంలో ఉన్న ‘అరవింద సమేత రాఘవ’నే కొంచెం మార్చి ‘అరవింద సమేత వీర రాఘవ’గా టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ ఈ టైటిల్‌ డిజైన్ చేసిన తీరు మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది.

‘అరవింద సమేత వీర రాఘవ’లో సబ్జెక్ట్ ‘వీర రాఘవ’నే. ‘అరవింద సమేత’ అనేది అసలు పేరుకు ముందు వచ్చే ఒక అడ్జెక్టివ్ లేదా జంప్ లైన్ లాంటిది.  ఇక్కడ నందమూరి బాలకృష్ణ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి ప్రస్తావించాలి. అందులో సబ్జెక్ట్ ‘శాతకర్ణి’ కాబట్టి దాన్ని పెద్దగా పెట్టారు. ‘గౌతమీపుత్ర’ పదాన్ని చిన్నది చేసి పైన ఉంచారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ విషయంలోనూ అదే స్టైల్ ఫాలో కావాలి.

ఎందుకంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ ‘వీర రాఘవ’నే. ‘అరవింద సమేత’ అనేది టైటిల్ కాదు. కానీ దానికి భిన్నంగా టైటిల్ డిజైన్ చేశారు. ‘అరవింద సమేత’ను పెద్దదిగా చేశారు. ‘వీర రాఘవ’ను క్యాప్షన్ లాగా పెట్టారు. ఇక్కడ త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంటు పని చేసినట్లుంది. ‘అతడు’.. ‘అత్తారింటికి దారేది’.. ‘అఆ’ లాంటి సినిమాలు బాగా ఆడిన నేపథ్యంలో ‘అరవింద సమేత’ను టైటిల్‌గా చేసినట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు