ఫైనల్ గా ‘మెహబూబా’ ఏమైనట్లు?

ఫైనల్ గా ‘మెహబూబా’ ఏమైనట్లు?

పూరి జగన్నాథ్ కమ్ బ్యాక్ ఫిలింగా ‘మెహబూబా’ గురించి చిత్ర బృందం ఘనంగా ప్రచారం చేసుకుంది. పూరి కొడుకు ఆకాశ్ హీరోగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడని కూడా అన్నారు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమా చూసి ఫిదా అయిపోయి.. దాని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి సినిమాను తన సొంత బేనర్ మీద రిలీజ్ చేశాడు. కానీ సినిమా చూసి అందరూ షాకయ్యారు. దీని గురించా ఇంతగా చెప్పుకున్నారు అని. పూరి కథ అయితే మార్చాడు కానీ.. ఇంకే మెరుపులూ చూపించలేకపోయాడు. ఈ సినిమాకు ఓపెనింగ్సే కరవయ్యాయి. టాక్ కూడా బ్యాడ్ గా ఉండటంతో సినిమా పుంజుకోలేకపోయింది. కానీ పూరి అండ్ కో మాత్రం సినిమా ఇరగాడేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు.

ఇది సొంత సినిమా కావడం.. ఈ చిత్రంతో కొడుకు భవిష్యత్తు కూడా ముడిపడి ఉంటంతో పూరి బృందం ప్రమోషన్లు గట్టిగానే చేసింది. అలుపు లేకుండా థియేటర్లకు తిరుగుతూ.. మీడియాతో మాట్లాడుతూ సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రచారం కూడా పెద్దగా ఫలితాన్నివ్వనట్లే కనిపిస్తోంది. రెండో వీకెండ్లోనూ సినిమా పుంజుకోలేదు. కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. వసూళ్లు లేకపోవడంతో థియేటర్లను తీసేసి ‘మహానటి’కి ఇచ్చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దిల్ రాజు రూ.9 కోట్లకు ఈ సినిమాను కొంటే మూడో వంతు మాత్రమే వసూలైనట్లు సమాచారం. వసూళ్లు మరీ నామమాత్రంగా ఉండటంతో వాటి వివరాలు కూడా మీడియాతో పంచుకోవడం లేదు. ఎక్కువ చేసి చూపిస్తే ఫేక్ కలెక్షన్లంటూ నెగెటివ్ ప్రచారం మొదలవుతుందని సైలెంటైపోయారు. దిల్ రాజు కొన్ని షరతుల మేరకే సినిమాను కొనడంతో నష్టాలు సెటిల్ చేయడానికి పూరి రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English