నాగ్ క‌రెక్టా? ర‌వితేజ క‌రెక్టా??

నాగ్ క‌రెక్టా? ర‌వితేజ క‌రెక్టా??

నాగార్జున‌తో తీసిన‌ ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సూప‌ర్ హిట్‌. ఆ త‌ర్వాత నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో చేసిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌. అయినా మ‌రో సినిమా చేయ‌డానికి బాగా వెయిట్ చేయాల్సి వ‌చ్చింది క‌ల్యాణ కృష్ణకి.  ఇప్పుడు ఆయ‌న మాస్ రాజా ర‌వితేజ‌తో చేసిన ‘నేల‌టికెట్‌’ వ‌చ్చేవారం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో తెగ బిజీబిజీగా గ‌డుపుతున్న క‌ల్యాణ కృష్ణ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ‘రారండోయ్ వేడుక చూద్దాం సినిమా స‌క్సెస్ అయిన త‌ర్వాత ఈ క‌థ రాశా. ముందు ఈ క‌థ‌ను వేరే పెద్ద హీరోను దృష్టిలో పెట్టుకుని రాశా. అయితే ఆయ‌న‌తో ప్రాజెక్టు వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో ప‌క్క‌న పెట్టేశా. అనుకోకుండా ఓసారి ర‌వితేజ‌ని క‌లిసిన‌ప్పుడు క‌థ వినిపించా. నిముషాల్లోనే ఆయ‌న క‌థ న‌చ్చి ఓకే చెప్పేశారు. ర‌వితేజ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా క‌థలో చాలా మార్పులు చేశా... సినిమా ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత ఈ సినిమాకి ర‌వితేజ‌యే క‌రెక్ట్ అనిపించింది’ అన్నాడు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా త‌ర్వాత నాగ్ తో సినిమా చేయాల్సింది క‌ల్యాణ్‌. కానీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాని ర‌వితేజతో పూర్తిచేశాడు. నాగ్ ఇమేజ్ వేరు. మాస్ రాజా ఇమేజ్ వేరు. ఆయ‌న‌కి రాసిన క‌థ ఈయ‌న‌కి ఎలా సెట్ అవుతుంది. మ‌రి ఈ సినిమాకి నాగ్ క‌రెక్టా! ర‌వితేజ క‌రెక్టా?  తెలియాలంటే ఇంకో వారం రోజులు వెయిట్ చేస్తే స‌రిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు