పూరీ-ఛార్మీ లాస్‌ పన్నెండు కోట్లు!

పూరీ-ఛార్మీ లాస్‌ పన్నెండు కోట్లు!

పూరి, ఛార్మి కలిసి మొదలు పెట్టిన పూరి కనక్ట్స్‌ సంస్థ తొలిసారిగా నిర్మించిన చిత్రం 'మెహబూబా'. తనయుడిని హీరోగా లాంఛ్‌ చేస్తూ పూరి ఒక సినిమా తలపెట్టే సరికి ఛార్మి చాలా నమ్మకంగా పెట్టుబడి పెట్టింది. పూరి కూడా తను రాసుకున్న కథ మీద నమ్మకంతో ఆస్తులు అమ్మి మరీ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో తెరకెక్కించాడు.

తనయుడికి క్రేజ్‌ వున్నా లేకపోయినా తన పేరు మీద పదిహేను కోట్లయినా బిజినెస్‌ అవుతుందని భావించాడు. పద్ధెనిమిది కోట్ల ఖర్చుకి తోడు ఇతరత్రా పబ్లిసిటీ ఖర్చులు కలుపుకుని ఇరవై కోట్లపైగానే దీనిపై ఖర్చయిందట. అయితే ఈ చిత్రానికి శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ కలుపుకుని మొత్తంగా చేతికి వచ్చేది ఎనిమిది కోట్లు దాటదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నికరంగా ఈ చిత్రంపై పన్నెండు కోట్లు పోయాయని, నష్టం ఇంకా ఎక్కువ వుండవచ్చు కానీ అందుకు తగ్గదని చెబుతున్నారు.

ఇందులో ఒక వంతు ఛార్మి పెట్టుబడి కాగా, మరో రెండు వంతులు పూరీదట. అంటే పన్నెండు కోట్ల నష్టంలో పూరి వాటాగా ఎనిమిది కోట్లు, ఛార్మికి నాలుగు కోట్లు పోతాయన్నమాట. ఇద్దరికీ ఇది పెద్ద దెబ్బే. దీనినుంచి కోలుకోవడం కోసం తదుపరి చిత్రాన్ని త్వరగా లాంఛ్‌ చేయాలని చూస్తున్నారు కానీ ప్రస్తుతం హీరోలే దొరకడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English