తన సినిమాను తనే కొట్టబోతున్న కీర్తి

తన సినిమాను తనే కొట్టబోతున్న కీర్తి

ఈ మధ్య కాలంలో ‘మహానటి’కి వచ్చినంత అప్లాజ్ మరే సినిమాకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడిన ప్రేక్షకులే లేరు. సినిమాలు చూడ్డం మానేసిన వాళ్లను కూడా ఈ చిత్రం థియేటర్లకు రప్పించింది. ప్రేక్షకుల్ని భావోద్వేగాల్లో ముంచెత్తింది. ఒక మాస్ సినిమా స్థాయిలో ఈ చిత్రం భారీ వసూళ్లతో నడుస్తోంది. రెండో వారంలో కూడా ‘మహానటి’ జోరు కొనసాగుతోంది.

ఈ వారం దీనికి భయపడి వేరే తెలుగు సినిమాలేవీ రిలీజ్ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ‘మహానటి’ అదరగొడుతోంది. అంచనా వేసినట్లే ఈ చిత్రం రెండో వీకెండ్ కంటే ముందే 2 మిలియన్ల మార్కును అందుకుంది. శుక్రవారమే ఈ చిత్ర వసూళ్లు ఆ మైలురాయిని దాటేశాయి. వీకెండ్ అయ్యేసరికి 2.5 మిలియన్ మార్కుకు చేరువగా ఈ చిత్రం వెళ్లే అవకాశాలున్నాయి.

2 మిలియన్ క్లబ్బులో ఉన్న ఒక్కో సినిమాను దాటుకుంటూ వెళ్లబోతోంది ‘మహానటి’. యుఎస్‌లో జస్ట్ 2 మిలియన్ మార్కును దాటిన సినిమాలు రెండున్నాయి. అందులో ఒకటి కీర్తి సురేష్ సినిమానే కావడం విశేషం. సంక్రాంతికి విడుదలైన ఆమె చిత్రం ‘అజ్ఞాతవాసి’ అక్కడ 2.065 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ‘ఫిదా’ సినిమా సైతం 2.074 మిలియన్ డాలర్లతో ఉంది. ఈ రెంటినీ శనివారమే దాటేయబోతోంది ‘మహానటి’.

ఆ తర్వాత దాని టార్గెట్ ‘ఖైదీ నంబర్ 150’ అవుతుంది. ఆ చిత్రం అక్కడ 2.447 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 2.5 మిలియన్ మార్కును అందుకోగలిగితే ‘అఆ’ను కూడా దాటేస్తుంది. ఆ చిత్ర 2.449 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అప్పుడు బాహుబలి రెండు భాగాలు, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు చిత్రాల తర్వాత ఆరో స్థానం ‘మహానటి’కి ఫిక్సవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English