అనుమానాలు పటాపంచలు చేసిన త్రివిక్రమ్‌

అనుమానాలు పటాపంచలు చేసిన త్రివిక్రమ్‌

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌ సామర్ధ్యంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకులని టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఎన్టీఆర్‌తో చేస్తోన్న సినిమాకి కథ సరిగా కుదరలేదని, ఇక చేసేది లేక అలాగే ముందుకెళుతున్నారని చాలా రకాలు కథలు ప్రచారంలో వున్నాయి.

'అరవింద సమేత రాఘవ' అనే టైటిల్‌ పెడుతున్నారనే వార్త వచ్చినపుడు కూడా త్రివిక్రమ్‌ ఇంకా మారలేదని, అజ్ఞాతవాసి మూడ్‌లోనే వున్నాడని కౌంటర్లు పడ్డాయి. అయితే 'అరవింద సమేత వీర రాఘవ' టైటిల్‌, పోస్టర్‌ డిజైన్‌తోనే ఈ చిత్రం ఎలా వుండబోతోందో త్రివిక్రమ్‌ ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చేసాడు. టైటిల్‌లో తన మార్కు క్లాస్‌ వున్నా లుక్‌లో ఎన్టీఆర్‌ మార్కు మాస్‌ మిస్‌ కాకుండా చూసుకున్నారు. ఈ చిత్రం కోసం సిక్స్‌ ప్యాక్‌ బాడీపై వర్క్‌ చేసిన ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌ లుక్‌ని ఎక్కువ కాలం దాచి పెట్టకుండా ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా రిలీజ్‌ చేసారు.

చేతిలో ఆయుధం, రక్తంతో తడిసిన దుస్తులు, సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సూపర్‌ ఫిట్‌గా ఎన్టీఆర్‌... ఈ పోస్టర్‌తో సినిమాపై వున్న నెగెటివిటీ ఏదైనా వుంటే అదంతా పోయింది. అనుమానాలన్నీ పటాపంచలు అయి ఆ స్థానంలో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. అజ్ఞాతవాసి కేవలం ఒక యాక్సిడెంట్‌ అని, తిరిగి గురూజీ ఎన్టీఆర్‌ సమేతంగా అదరగొడతారనే నమ్మకం బలపడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English