‘జడ్జిమెంట్ కింగ్’ పేరు మళ్లీ వాడుతున్నారు

‘జడ్జిమెంట్ కింగ్’ పేరు మళ్లీ వాడుతున్నారు

‘జడ్జిమెంట్ కింగ్’ అని దిల్ రాజుకున్న పేరు ఈ మధ్య కాలంలో దెబ్బ తింటోంది. ఆయన ఏరి కోరి డిస్ట్రిబ్యూట్ చేస్తు్న్న సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నాయి. టాలీవుడ్లో అతి పెద్ద డిజాస్టర్ అనిపించుకున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాను నైజాంలో పంపిణీ చేసింది ఆయనే. ఇక ముందే ప్రివ్యూ చూసి తనకు నచ్చిన సినిమాను హోల్‌సేల్‌గా కొనేసి రిలీజ్ చేసే అలవాటున్న రాజు.. ఆ తరహాలోనే ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘మెహబూబా’ సినిమాలను తన బేనర్ మీదుగా రిలీజ్ చేశాడు. కానీ అవి రెండూ తేడా కొట్టేశాయి.

తమ సినిమాను దిల్ రాజు ఏకమొత్తంగా కొనడాన్ని గొప్ప అచీవ్మెంట్‌లాగా భావిస్తారు వేరే నిర్మాతలు. ఇది సినిమా సెల్లింగ్ పాయింట్ లాగా మారింది. ఆ విషయం చెప్పే పబ్లిసిటీ కూడా చేస్తుంటారు. ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘మెహబూబా’ సినిమాల విషయంలోనూ అది జరిగింది. కానీ చివరికి వాటి ఫలితాలేంటో తెలిసిందే. ఆ రెండు సినిమాల వల్ల రాజు ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిన మాట వాస్తవం. ప్రేక్షకులకు ఆయన మీద ఉన్న భరోసా సడలింది.

ఇలాంటి టైంలో మరో చిత్ర బృందం దిల్ రాజు పేరును వాడేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ రూపొందిస్తున్న ‘సాక్ష్యం’ సినిమా నైజాం హక్కుల్ని దిల్ రాజు కొన్నారట. దీని గురించి నిన్నట్నుంచి ఆ చిత్ర బృందం ఊదరగొట్టేస్తోంది. స్వయంగా నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి ఆయన సినిమాను రాజు కొనడం చిత్రంగా అనిపించింది. సొంతంగా రిలీజ్ చేసుకోకుండా రాజుకు హక్కులివ్వడం.. బెల్లంకొండ శ్రీనివాస్ పెద్ద హీరో ఏమీ కాకపోయినా ఈ సినిమాను రాజు కొనడం ఆశ్చర్యం కలిగించింది. సినిమాకు క్రేజ్ తేవడానికి రాజు పేరును ఇలా తెరమీదికి తెచ్చారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. కానీ ఇంతకుముందులాగా రాజు పేరు చూసి జనాలు థియేటర్లకు పరుగులు పెట్టేసే సీన్ ఉందా అన్నది సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English