అమ్మ‌డు ఇక సిగ‌రెట్ తాగ‌ద‌ట‌

అమ్మ‌డు ఇక సిగ‌రెట్ తాగ‌ద‌ట‌

స్వ‌ర భాస్క‌ర్‌... సినిమాల్లో బోల్డ్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ హాట్ సుంద‌రి. అందుకే ఏరికోరి విభిన్న‌మైన పాత్ర‌లు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తాయి. ఇప్పుడు ‘వీర్ ది వెడ్డింగ్‌’ సినిమాలో ఛెయిన్ స్మోక‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది స్వ‌రా భాస్క‌ర్‌. అయితే ఈసినిమా త‌ర్వాత‌ ఇక‌పై సినిమాల్లో ఇలాంటి పాత్ర‌లు చేయ‌నని తెగేసి చెబుతోందీ చిన్న‌ది.

‘అనార్క‌లి ఆఫ్ ఆరా’ సినిమాలో బిడీలు తాగుతూ... తెగ హ‌డావిడి చేసింది స్వ‌రా భాస్క‌ర్‌. అప్ప‌ట్లో అది వివాదాస్ప‌ద‌మైనా సినిమాకి మంచి ప‌బ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు క‌పూర్ భామ‌ల‌తో క‌లిసి న‌టిస్తున్న ‘వీర్ ది వెడ్డింగ్‌’ సినిమాలో టెన్ష‌న్ ఆపుకోవ‌డానికి నిత్యం చేతిలో సిగ‌రెట్ పెట్టుకుని కాల్చుతూ... గుప్పుమ‌ని పొగ వ‌దిలే కార్పొరేట్ గ‌ర్ల్ పాత్ర‌లో న‌టిస్తోంది స్వ‌రా భాస్క‌ర్‌. ‘సిగ‌రెట్ కాల్చ‌డం నాకు ఏమాత్రం న‌చ్చ‌దు. కానీ  ద‌ర్శ‌కుడు శ‌శాంక్ గోష్ మాత్రం ఓ ప్రొఫెష‌న‌ల్ స్మోక‌ర్ లా సిగ‌రెట్ తాగ‌ల‌న్నాడు. స‌రిగ్గా తాగ‌ట్లేద‌ని చెప్పి మ‌ళ్లీ మళ్లీ షాట్ తీయించాడు. దాంతో త‌ప్ప‌క తాగాల్సి వ‌చ్చింది. ఒక్క‌సారిగా ప్రాణం పోయినంత ప‌నైంది... ఆ సీన్ కంప్లీట్ అయిన త‌ర్వాత సోన‌మ్ క‌పూర్‌- క‌రీనా క‌పూర్‌- శిశా త‌ల్సానియా క‌లిసి పార్టీ చేసుకున్నాం...’ అంటూ పొగ పీల్చేందుకు తానెంత క‌ష్ట‌ప‌డిందో చెప్పుకొచ్చింది స్వ‌రా భాస్క‌ర్‌.

అంతేకాదు ఈ సంఘ‌ట‌న జీవితంలో మ‌రిచిపోలేన‌ని... ఇంకెప్పుడూ సినిమాల్లో కూడా సిగ‌రెట్ తాగే స‌న్నివేశం చేయ‌న‌ని తెగేసి చెప్పేసింది స్వ‌రా భాస్క‌ర్‌.  ‘వీర్ ది వెడ్డింగ్‌’ సినిమా జూన్ 1న విడుద‌ల‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు