ఆ హీరో జీరో అయిపోయాడుగా..

ఆ హీరో జీరో అయిపోయాడుగా..

ఒకే ఒక్క సినిమాతో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ. రెండేళ్ల కిందట ‘బిచ్చగాడు’ సినిమా ఏ రేంజిలో ఆడిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా తెచ్చిన పేరును.. మార్కెట్‌ను నిలబెట్టుకోలేకపోయాడు విజయ్. ‘బిచ్చగాడు’ క్రేజ్‌ను వాడేసుకుందామని చకచకా సినిమాలు చేశాడు. ఏడాదిన్నర వ్యవధిలో నాలుగు సినిమాలతో పలకరించాడు.

కానీ క్వాంటిటీ మీద చూపించిన శ్రద్ధ.. క్వాలిటీపై లేకపోయింది. దెబ్బకు మొత్తం మార్కెట్ అంతా పోయి జీరో అయిపోయాడు. తమిళంలో పరిస్థితి ఏంోట కానీ.. తెలుగులో మాత్రం అతడి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ శుక్రవారం రిలీజైన విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘కాశి’కి కనీస ఓపెనింగ్స్ లేవు. ఈ వారానికి తెలుగు రిలీజ్‌లు ఏమీ లేని టైం చూసి రిలీజ్ చేసినా దీనికి స్పందన లేదు.

ఇక సినిమా టాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నత్తనడకన సాగే ఈ సినిమా డ్రామాను.. సీరియళ్లను తలపిస్తోందని అంటుున్నారు. ఈ చిత్రానికి రిలీజ్ ఖర్చులు రావడం కూడా కష్టమే అన్నట్లుంది పరిస్థితి. ‘బిచ్చగాడు’ తర్వాత వచ్చిన ‘బేతాళుడు’ సరిగా ఆడకపోయినా వైవిధ్యమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం విజయ్ పేలవమైన సినిమాలతో వచ్చాడు. ‘యమన్’లో ఏ విశేషం లేదు. ‘ఇంద్రసేన’ చెత్త సినిమా. ఇప్పుడు ‘కాశి’ కూడా ఆ కోవలోకే చేరింది.

‘కాశి’నే జనాలు పట్టించుకోనపుడు.. ఇలాంటి పేలవమైన సినిమా తర్వాత రాబోయే చిత్రంపై ఏమాత్రం ఆసక్తి ఉంటుంది. ఒకే ఒక్క సినిమాతో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కింద పడిపోయాడు విజయ్. తెలుగులో అతడి కెరీర్‌కు దాదాపుగా తెరపడినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు