మహేష్‌ హీరోయిన్ బోల్డ్ గా చేసేసిందే

మహేష్‌ హీరోయిన్ బోల్డ్ గా చేసేసిందే

సీఎం మనసునే కొల్లగొట్టిన అందాల భామగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను మధ్య తరగతి ఆడపిల్లగా పద్ధతైన పాత్రలో కనిపించింది.  భరత్ అనే నేను హీరోయిన్ గా వచ్చిన గుర్తింపుతో కియారాకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు బాగానే వస్తున్నాయి.

కియారా హిందీలో తాజాగా లస్ట్ స్టోరీస్ మూవీలో ఓ హీరోయిన్ గా నటించింది. కాకుంటే ఇది రెగ్యులర్ సినిమా సినిమా కాదు. ఇది నెట్ ఫ్లిక్స్ తీసిన మూవీ. అంటే నెట్ లోనే చూసే వీలుంటుంది. టైటిల్ లో చెప్పినట్టుగా ఇది ఈతరం నగర జీవితాల్లోని పెళ్లయిన ఆడవాళ్ల సీక్రెట్ అఫెయిర్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో నలుగురు హీరోయిన్లగా ఒకరుగా కియారా నటిస్తోంది. తెలుగులో ఎక్స్ పోజింగ్ మాటెత్తకుండా సినిమా చేసేసిన కియారా లస్ట్ స్టోరీస్ చాలా బోల్డ్ గా నటించేసింది. కాస్త ఎరోటిక్ గా తీసిన సీన్లలోనూ రెచ్చిపోయి నటించేసింది. సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ తో మతులు పోగొట్టేసింది. రీసెంట్ రిలీజయిన ట్రయిలర్ లో కియారా పాత్ర చూస్తే ఆమె ఇంత హాట్ గా కనిపించగలదా అనిపించక మానదు.

లస్ట్ స్టోరీస్ లో కియారాతోపాటు రాధికా ఆప్టే - భూమి పెడ్నేకర్ - మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ లోని నలుగురు ఫేమస్ డైరెక్టర్లు ఈ నెట్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. జూన్ 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ చూడొచ్చు. కియారా ఇంకెంత బోల్డ్ గా నటించిందో పూర్తిగా తెలియాలంటే జూన్ 15 వరకు ఆగాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు